AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 Lab Leak: కరోనా వైరస్‌ వూహాన్‌ ల్యాబ్‌ నుంచే లీక్‌ కావచ్చు.. సమగ్ర దర్యాప్తు చేయాల్సిందే: శాస్త్రవేత్తల సంచలన లేఖ

Covid-19 Lab Leak: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. రోజురోజుకు వైరస్‌ మరింతగా వ్యాపిస్తుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే మొదటగా చైనాలో..

Covid-19 Lab Leak: కరోనా వైరస్‌ వూహాన్‌ ల్యాబ్‌ నుంచే లీక్‌ కావచ్చు.. సమగ్ర దర్యాప్తు చేయాల్సిందే: శాస్త్రవేత్తల సంచలన లేఖ
Subhash Goud
|

Updated on: May 22, 2021 | 2:15 PM

Share

Covid-19 Lab Leak: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. రోజురోజుకు వైరస్‌ మరింతగా వ్యాపిస్తుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే మొదటగా చైనాలో వ్యాపించిన ఈ వైరస్‌.. ప్రపంచ దేశాలన్నింటికి చాపకింద నీరులా వ్యాపించి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఇక ఈ వైరస్‌పై ముందు నుంచే చైనా ఇతర దేశాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటోంది. చైనాలోని వుహాన్ ల్యాబ్‌ నుంచి బయటకు వచ్చిందనే వాదనలు మరోసారి ఊపందుకున్నాయి. కరోనాతో జీవాయుధాల తయారీపై చైనా శాస్త్రవేత్తలు 2015లోనే చర్చించినట్టు ఇటీవల ఆస్ట్రేలియా మీడియా ఓ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో కోవిడ్‌-19 మూలాలపై మరింత దర్యాప్తు జరపాలని అమెరికా, బ్రిటన్‌ శాస్త్రవేత్తలు డిమాండ్‌ చేశారు. ఇది వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచి ప్రమాదవశాత్తు లీకై ఉంటుందన్న వాదనపైనా దృష్టి సారించాలని పేర్కొన్నారు. వీరిలో కేంబ్రిడ్జ్ వర్సిటీ ప్రొఫెసర్, భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త రవీంద్ర గుప్తా కూడా ఉన్నారు.

వైరస్‌ జంతువుల నుంచి నేరుగా మనుషులకు వ్యాపించి ఉండొచ్చనేది ఒక వాదనైతే… చైనాలోని వుహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచి బయటికొచ్చి ఉండొచ్చనేది మరో వాదన. అయితే రెండో వాదనను బలపరిచే అంశాలు అనేకం ఉన్నాయని ప్రముఖ సైన్స్‌ రచయిత నికొలస్‌ వేడ్‌ అంటున్నారు. గబ్బిలాల్లోని కరోనా వైర్‌సను జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ ద్వారా మానవ కణాల్లోకి ప్రవేశపెట్టడంపై పరిశోధనలు జరుగుతున్నందున… ఆ ల్యాబ్‌ నుంచి వైరస్‌ బయటికి వచ్చిందనే వాదనకు ఇది బలం చేకూరుస్తోందని నికొలస్‌ స్పష్టం చేశారు.

18 మంది శాస్త్రవేత్తల లేఖ..

ఈ కరోనా వైరస్‌ గురించి పూర్తిస్థాయి సమాచారం లభించే వరకూ, ల్యాబ్‌ నుంచి వెలువడిందన్న వాదనతోపాటు సహజసిద్ధంగా వచ్చి ఉంటుందన్న వాదననూ పరిగణనలోకి తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. ఈ మేరకు 18 మంది శాస్త్రవేత్తలు రాసిన లేఖ ‘సైన్స్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది. కోవిడ్‌ మూలాలపై స్పష్టత అవసరమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్, యూరోపియన్‌ యూనియన్‌, అమెరికా సహా పలు దేశాలు వ్యక్తం చేసిన సందేహాలతో తాము ఏకీభవిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

అయితే కోవిడ్‌ మూలాలపై అధ్యనానికి చైనా- డబ్ల్యూహెచ్‌వో ఉమ్మడి బృందం ఏర్పడిందని తెలిపారు. దర్యాప్తునకు సంబంధించిన తొలి దశలో సమాచారం, డేటా, నమూనాలను ఈ బృందంలోని చైనా సభ్యులు సేకరించారు. దీని ఆధారంగా మిగతా బృందం విశ్లేషణ చేసింది. కరోనా వైరస్‌ సహజసిద్ధంగా వచ్చిందా లేక ల్యాబ్‌ నుంచి లీకైందా అనేది విషయం తేలలేదు. గబ్బిలాల నుంచి ఓ జంతువు ద్వారా మనుషులకు ఈ వైరస్‌ వ్యాపించి ఉండటానికే ఆస్కారం ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ల్యాబ్‌ నుంచి బయటకు వచ్చే అవకాశం దాదాపుగా లేదని తెలిపింది. నిజానికి ఈ రెండు సిద్ధాంతాలపై సరైన పరిశీలన జరగలేదు అని పేర్కొన్నారు. అయితే కరోనా వైరస్‌ సహజసిద్ధంగా వచ్చిందా లేక ల్యాబ్‌ నుంచి లీకైందా ఈ రెండు పరిగణనలోకి తీసుకోవాల్సినవే అని స్టాన్‌ఫర్డ్ క్లినికల్ మైక్రోబయలజిస్ట్ డేవిడ్ రెల్మన్ సహా శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

ఇవీ కూడా చదవండి:

Oxygen: మీ మొబైల్‌లోనే ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవచ్చు.. యాప్‌కు రూపకల్పన చేసిన కోల్‌కతాకు చెందిన అంకుర సంస్థ

Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌పై కేంద్రం కీలక ప్రకటన.. అంటు వ్యాధిగా గుర్తించాలంటూ రాష్ట్రాలకు లేఖ.. కీలక సూచనలు

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే