China Corona: షాంఘైలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. కఠిన లాక్‌డౌన్.. పెరుగుతున్న కేసుల సంఖ్య..!
China Corona: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత రెండేళ్లుపైగా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా అదుపులోకి వచ్చిందనుకుంటే.. మరోసారి విజృంభిస్తోంది. ఇక చైనాలో కోవిడ్..
China Corona: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత రెండేళ్లుపైగా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా అదుపులోకి వచ్చిందనుకుంటే.. మరోసారి విజృంభిస్తోంది. ఇక చైనాలో కోవిడ్ కేసులు (Covid Caes) పెరుగుతున్నాయి. గడిచిన నెల రోజులుగా కరోనాతో చైనాలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కరోనా పుట్టినిల్లు అయినా కరోనా.. మరోసారి తన ప్రతాపం చూపుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వంతో పాటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆంక్షలు కఠినతరం చేస్తున్నారు అక్కడి అధికారులు. గత నాలుగు వారాలుగా కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తున్నప్పటికీ కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఒక్క షాంఘైలోనే గడిచిన 24 గంటల్లో 39 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో నగరంలో కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 87కు చేరుకుంది. మరోవైపు రాజధాని బీజింగ్‌లోనూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు బీజింగ్‌లో వైరస్ కట్టడికి చర్యలు ముమ్మరం చేశారు.
చైనాలో నిన్న ఒక్క రోజే 21,796 కేసులు:
కాగా, చైనాలో నిన్న ఒక్క రోజే 21,796 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అక్కడి వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాజధాని బీజింగ్‌లోని ఓ పాఠశాలలో 10 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో పాఠశాలను మూసివేశారు అధికారులు. పాఠశాలలోని విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకే సారి పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. వైరస్ వ్యాప్తి మరింతగా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలోని షాంఘై నగరం కాకుండా మరో 16 ప్రావిన్స్‌లోనూ కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోందని, ఇంకా కేసులు బయటపడుతూనే ఉన్నాయిన ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మరో వైపు షాంఘైలో కఠిన లాక్‌డౌన్ కొనసాగుతోంది. చైనా పుట్టినిల్లు అయిన కరోనా మహమ్మారి.. గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉండి.. మరోసారి విజృంభిస్తోంది. చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తుండటంతో ప్రజలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. రెండేళ్ల కిందట తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రజలకు ఇప్పుడు మరోమారు కరోనా వెంటాడుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: