AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jinping House Arrest Rumor: చైనా అధ్యక్షుడి హౌస్‌ అరెస్ట్‌పై వీడిని సస్పెన్స్‌.. ముచ్చటగా మూడోసారి కోసం జిన్‌పింగ్‌ వ్యూహాలు..

చైనా అధ్యక్షుడి వ్యవహారంలో ఇంటాబయటా వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడింది. జిన్‌పింగ్‌ను చైనీస్‌ ఆర్మీ నిర్బంధించిందని ఇప్పటిదాకా సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా జిన్‌పింగ్‌ బయట కనిపించడంతో ఆయన గృహనిర్బంధంలో ఉన్నారన్న వార్తలకు చెక్‌ పడింది.

Jinping House Arrest Rumor: చైనా అధ్యక్షుడి హౌస్‌ అరెస్ట్‌పై వీడిని సస్పెన్స్‌.. ముచ్చటగా మూడోసారి కోసం జిన్‌పింగ్‌ వ్యూహాలు..
Xi Jinping
Sanjay Kasula
|

Updated on: Sep 27, 2022 | 9:00 PM

Share

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై వస్తున్న వార్తల వేడి సర్దుమణిగింది. ఆ దేశంలో అత్యంత శక్తిమంతమైన నేత, ఆర్మీకి సర్వ సైన్యాధ్యక్షుడు అయిన జిన్‌పింగ్‌ గృహ నిర్బంధంలో ఉన్నారని చైనీస్‌ సోషల్‌ మీడియాతో పాటు లోకం కూడా కోడై కూసింది. దీంతో ప్రపంచంలో కలకలం, కలవరం రేగాయి. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సుకు వెళ్లి, తిరిగి చైనాకు వచ్చాక జిన్‌పింగ్‌ను ఆర్మీ గృహ నిర్బంధంలో ఉంచిందని ఊహాగానాలు చెలరేగాయి. దీనికితోడు సమర్కండ్‌ వెళ్లివచ్చాక జిన్‌పింగ్‌ ఎక్కడా కనిపించకపోవడం, ఆయన స్వరం వినిపించకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.

తాజాగా జిన్‌పింగ్‌ ఓ కార్యక్రమంలో కనిపించడంతో ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారన్న ఊహాగానాలకు తెర పడింది. మంగళవారం ఆయన బీజింగ్‌లోని ఓ ఎగ్జిబిషన్‌ను సందర్శించారని చైనా సర్కార్‌ మీడియా వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం మధ్య ఆసియా పర్యటన తర్వాత జిన్‌పింగ్‌ బయట కనిపించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. షీ జిన్‌పింగ్‌ను నిర్బంధించారని, పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ చీఫ్‌గా ఉన్న ఆయన తొలగించారని ఇప్పటివరకు వదంతులు వ్యాపించాయి.

దీన్ని చైనా ప్రభుత్వం కానీ, కమ్యూనిస్టు పార్టీ కానీ, ఆ దేశ ఆర్మీ కానీ ఖండించకపోవడంతో ఏదో జరిగిందని అందరు అనుమానించారు. సెంట్రల్‌ ఆసియా పర్యటనలో ఉన్నప్పుడే జిన్‌పింగ్‌పై కుట్ర జరిగిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. చైనాలో మావో జెడాంగ్‌ తర్వాత అత్యంత శక్తిమంతమైన నేతగా ఎదిగిన జిన్‌పింగ్‌ తన అధికారాన్ని శాశ్వతం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని చెబుతున్నారు. వచ్చే నెలలో జరిగే సీపీసీ సమావేశాల్లో జిన్‌పింగ్‌ మూడోసారి చైనా అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు ఆమోద ముద్ర లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

చైనాలో ఏం జరుగుతోంది..

నిజంగానే జిన్‌పింగ్‌పై సైన్యం తిరుగుబాటు చేసిందా..? మూడోసారి కూడా అధ్యక్షుడిగా కొనసాగాలన్న నిర్ణయంతోనే హౌస్‌ అరెస్ట్‌ చేశారా..? ఇందుకు జిన్‌పింగ్‌ సమర్‌కండ్‌లో ఉన్నప్పుడే కుట్ర జరిగిందా..? అసలు చైనాలో ఏం జరుగుతోంది..? ఐతే జిన్‌పింగ్‌ తన పదవిని శాశ్వతం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. చైనాలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా జిన్‌పింగ్‌ కసరత్తు చేస్తున్నారు. చైనా కమ్మూనిస్ట్‌ పార్టీ 20వ నేషనల్‌ కాంగ్రెస్‌ సమావేశాలు అక్టోబర్‌ 16న ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు జిన్‌పింగ్‌కు ఎంతో ప్రత్యేకమైనవి. అధ్యక్షుడిగా, మిలటరీ అధినేతగా బాధ్యతలు చేపట్టి జిన్‌పింగ్‌ పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి.

ముచ్చటగా మూడోసారి..

నేషనల్‌ కాంగ్రెస్‌ సమావేశాల్లో జిన్‌పింగ్‌ మూడోసారి పదవిని చేపట్టే దిశగా సభ్యుల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మూడోసారి మరో ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం అధికారంలో కొనసాగేందుకు సభ్యులు మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది.

సైనిక వాహనాలు బీజింగ్‌కు బయలుదేరాయి..

చైనా మానవ హక్కుల కార్యకర్త అయిన జెన్నిఫర్ జెంగ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ.. PLA బీజింగ్ వైపు కదులుతున్నట్లు పేర్కొంది. జెన్నిఫర్ జెంగ్ ట్విట్టర్‌లో ఇలా పోస్ట్ చేశాడు. PLA సైనిక వాహనాలు సెప్టెంబర్ 22న బీజింగ్‌కు వెళ్తాయి. బీజింగ్ సమీపంలోని హువాన్‌లై కౌంటీ నుండి ప్రారంభమై హెబీ ప్రావిన్స్‌లోని జాంగ్జియాకౌ సిటీలో ముగుస్తుంది. ఇది 80 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇదిలా ఉంటే CCP సీనియర్లను తొలగించిన తర్వాత జిన్‌పింగ్‌ అరెస్టు చేయబడిందని పుకారు వచ్చింది.

చైనీస్ రచయిత గోర్డాన్ చాంగ్ కూడా ఏం ట్వీట్ చేశారంటే..

చైనీస్ రచయిత గోర్డాన్ చాంగ్ జెంగ్ వీడియోను ట్వీట్ చేశారు. బీజింగ్‌కు వెళ్లే సైనిక వాహనాల వీడియో దేశంలోని 59 శాతం విమానాలు, సీనియర్ అధికారుల జైళ్లను గ్రౌండింగ్ చేసిన కొద్దిసేపటికే వచ్చాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం