పాకిస్తాన్ – చైనా మధ్య కోల్డ్ వార్‌.. వివాదంగా మారిన అమ్మాయి డ్యాన్స్ వీడియో.. సోషల్ మీడియా వేదికగా రచ్చ..

Chinese Ambassador: ఆ ఇద్దరి మధ్య కొనసాగుతున్న లవ్ స్టోరీకి చిన్న బ్రేక్ పడింది. ఓ చిన్న వీడియో ట్వీట్ పెద్ద రచ్చకు కారణంగా మారింది. అయితే ఈ వీడియో ఇరు దేశాల మధ్య పెద్ద కోల్డ్ వార్‌కు దారి తీసింది.

పాకిస్తాన్ - చైనా మధ్య కోల్డ్ వార్‌.. వివాదంగా మారిన అమ్మాయి డ్యాన్స్ వీడియో.. సోషల్ మీడియా వేదికగా రచ్చ..
Follow us
Sanjay Kasula

| Edited By: Team Veegam

Updated on: Mar 08, 2021 | 4:31 PM

‘Hijab off’ Tweet: ఆ ఇద్దరి మధ్య కొనసాగుతున్న లవ్ స్టోరీకి చిన్న బ్రేక్ పడింది. ఓ చిన్న వీడియో ట్వీట్ పెద్ద రచ్చకు కారణంగా మారింది. అయితే ఈ వీడియో ఇరు దేశాల మధ్య పెద్ద కోల్డ్ వార్‌కు దారి తీసింది. పాకిస్తాన్ ప్రజలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

అది కూడా పాకిస్తాన్‌లోని చైనా రాయబారి చేసిన ట్వీట్ ఓ పెద్ద రచ్చకు కారణంగా మారింది. చైనా దౌత్యవేత్త చేసిన వివాదం కాస్తా ప్రధాని ఇమ్రామన్ ఖాన్ వద్దకు చేరింది. ‘హిజాబ్’కు సంబంధించిన ట్వీట్ వివాదంను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ దృష్టికి తీసుకువెళ్లింది. “హిజాబ్” గురించి కామెంట్ చేయడం అంటే “ఇస్లాం” పై దాడిగా పేర్కొన్నారు అక్కడి విదేశాంగ మంత్రిత్వ శాఖ. వాస్తవానికి, చైనాలో ముస్లిం మైనారిటీల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.

వివాదంగా మారిన ట్వీట్..

సలహాదారుతోపాటు డైరెక్టర్ జెంగ్ హెకింగ్ రెండు రోజుల క్రితం జిన్జియాంగ్ ప్రావిన్స్ ఒక అమ్మాయి వీడియోను ట్వీట్ చేశారు. ఓ అందమైన అమ్మాయి ఆ వీడియోలో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవంకు ఒక రోజు ముందు చైనా దౌత్యవేత్త ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌ను చైనీస్‌ భాషతోపాటు ఇంగ్లీష్‌లోనూ పోస్ట్ చేశాడు.

ఆ ట్వీట్‌లో వీడియోతోపాటు ఓ కామెంట్ కూడా జోడించాడు. ఇందులో “మీ హిజాబ్ తీసేయండి, మీ కళ్ళు చూద్దాం” అని ట్వీట్ చేశారు. తరువాతి ట్వీట్‌లో, చైనాలో చాలా మంది ఈ పాటను ఇష్టపడతారని రాశారు.

వివాదంపై స్పందించని ముస్లిం దేశాలు…

అయితే ఈ మొత్తం విదానికి కారణమైన ఈ వీడియో పెద్ద దుమారం రేపుతోంది. పాకిస్తాన్ ప్రజలు చైనా దౌత్య అధికారి జెంగ్ హెకింగ్‌ను సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ముస్లింలపై చైనా చేస్తున్న దురాగతాలను ప్రపంచం మొత్తం చూస్తోంది అంటూ పోస్టులు పెడుతున్నారు. చైనా చేస్తున్న దాడుల వీడియోలను కూడా పోస్ట్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా జగుతున్న యుద్ధంపై పాకిస్తాన్ అధికారికంగా స్పందించలేదు.

అయితే వివాదం ముదురుతుండటంతో చైనా దౌత్య అధికారి జెంగ్ హెకింగ్ వెంటనే తన పోస్టును తొలిగించాడు. పోస్ట్ తొలిగించినప్పటికీ నెటిజలన్లు మాత్రం తమ దాడిని ఆపటం లేదు.

కొన్ని రోజుల క్రితం, చైనా యొక్క జిన్జియాంగ్ ప్రావిన్స్‌లోని నిర్బంధ శిబిరం నుండి తప్పించుకున్న ఒక మహిళ శిబిరాల యొక్క భయానక వాస్తవికతను ఒక బిబిసి నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం, జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో చైనా వేలాది నిర్బంధ శిబిరాలను ఏర్పాటు చేసింది, ఇందులో లక్షలాది మంది ఉయ్ఘర్ ముస్లింలు జైలు పాలయ్యారు.

ఇవి కూడా చదవండి: ఐపీఎల్ 2021 రచ్చ.. ఏప్రిల్‌ 9 నుంచి క్రికెట్‌ ప్రేమికుల పండుగ.. ఏ జట్టులో ఎవరున్నారు..!

ముంబై-ఆర్‌సీబీ పోరుతో ఐపీఎల్-2021 మొదలు.. ముగింపు నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్​ 2021 ఫైనల్

తెలంగాణలోని ఆ ప్రాంతంలో చేపలు విషపూరితం.. తిన్నారో అంతే సంగతులు