China vs America: ‘నిప్పుతో చెలగాటమొద్దు’.. బైడెన్‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన జిన్‌పింగ్.. రియాక్షన్ ఏంటో తెలుసా?
China vs America: తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే అది నిప్పుతో చలగాటమే అవుతుందని బైడెన్‌కు తీవ్రంగా హెచ్చరించారు జిన్‌పింగ్...
China vs America: తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే అది నిప్పుతో చలగాటమే అవుతుందని బైడెన్‌కు తీవ్రంగా హెచ్చరించారు జిన్‌పింగ్. అయితే, బైడెన్ మాత్రం తగ్గేదేలే అంటూ.. తమ విధానం ఇంతేనని తెగేసి చెప్పేశారు. ఈ నేపథ్యంలో తైవాన్ అంశం అమెరికా-చైనా సంబంధాల్లో మరింత దూరం పెంచింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన టెలిఫోన్ టాక్స్‌లో ఈ విబేధాలు బయట పడ్డాయి. రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇద్దరు అగ్ర నాయకులు ఒకరికి ఒకరు వార్నింగ్స్ ఇచ్చుకున్నారు.
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన వివాదానికి కారణమైంది. ఇద్దరు అగ్రనాయకుల చర్చల్లో తైవాన్ ప్రధానాంశంగా మారింది. నాన్సీ పెలోసీ తైపీ పర్యటనలను ప్రస్థావించిన జిన్‌పింగ్ అమెరికాకు గట్టి వర్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘మీరు నిప్పుతో ఆటలు ఆడితే అది మీకే కాలుతుంది. అమెరికా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటుందనుకుంటాను’ అని బైడెన్‌కు నేరుగా చెప్పేశారు జిన్‌పింగ్. అయితే బైడెన్ కూడా అంతే ధీటుగా సమాధానం ఇచ్చారు. తైవాన్ విషయంలో తమ దేశ పాలసీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. వీరిద్దరి మధ్య చర్చల్లో ఇరు దేశాల మధ్య ఆర్ధిక సహకారం, ఉక్రెయిన్ అంశాలు కూడా చర్చ వచ్చాయి.
నాన్సీ పెలోసి తైవాన్ పర్యటన షెడ్యూల్ ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడి కాకున్నా, వచ్చే నెల మొదటి వారం అక్కడికి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. పెలోసీ పర్యటను దృష్టిలో పెట్టుకొని అమెరికా దక్షిణ చైనా సముద్రంలో నౌకలను, ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్‌లను మొహరిస్తోంది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగం అని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది. తాజాగా చైనా సైన్యం తైవాన్ మీద దండెత్తే అవకాశం ఉందనే వార్తలు రావడంతో ఆ దేశం వార్ డ్రిల్స్ చేపట్టింది. అమెరికా మద్దతుతోనే తైవాన్ రెచ్చిపోతోందని చైనా గుర్రుగా ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..