Corona: ప్రపంచం మీద కరోనా మరోసారి దాడి చేయబోతోందా..? అక్కడ లాక్‌డౌన్‌ దేనికి సంకేతాం..!

Covid 19: ప్రపంచం మీద కరోనా మహహ్మరి మరోసారి దాడి చేయబోతోందా? పోర్త్ వేవ్ వచ్చే చాన్స్ లేకపోలేదా.?. చైనాతో, హంకాంగ్‌, దక్షిణ కొరియా దేశాల్లో నమోదవుతున్న రోజువారి కేసులు..

Corona: ప్రపంచం మీద కరోనా మరోసారి దాడి చేయబోతోందా..? అక్కడ లాక్‌డౌన్‌ దేనికి సంకేతాం..!
Follow us
Subhash Goud

|

Updated on: Mar 14, 2022 | 7:19 AM

Covid 19: ప్రపంచం మీద కరోనా మహహ్మరి మరోసారి దాడి చేయబోతోందా? పోర్త్ వేవ్ వచ్చే చాన్స్ లేకపోలేదా.?. చైనాతో, హంకాంగ్‌, దక్షిణ కొరియా దేశాల్లో నమోదవుతున్న రోజువారి కేసులు.. అమలు చేస్తున్న కఠిన లాక్ డౌన్ (Lockdown) దేనికి సంకేతం. పుట్టిన దేశాన్ని విడవనంటోంది మహమ్మారి. చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను నట్టేటముంచిన కరోనా మరోసారి మరోసారి చైనాను పట్టిపీడిస్తుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం డ్రాగన్‌ ను కలవరపెడుతోంది. తాజాగా చైనా (China) దేశవ్యాప్తంగా దాదాపు 3పైగా కేసులు నమోదు అవుతున్నట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 3400కి చేరినట్లు ప్రకటించింది. చైనా రాజధాని బీజింగ్‌లో తాజాగా అత్యధిక కేసులు వెలుగు చూశాయి. జిలిన్ ప్రావిన్స్‌లో గరిష్టంగా 1,412 కేసులు నమోదయ్యాయి. టెక్నాలజీ కంపెనీలకు మారుపేరైన షెన్‌జెన్‌ నగరంలో 66 ఒమిక్రాన్‌ కేసులు రావడంతో అక్కడ లాక్‌డౌన్‌ విధించింది. కోటీ 70 లక్షల మందిని ఇళ్ల నుంచి బయటకు రావొద్దని చెప్పింది. ఇక జిలిన్ ప్రావిన్స్‌లోని చాంగ్‌చున్ సహా అనేక ప్రాంతాల్లో ఇటీవల లాక్‌డౌన్‌లు విధించారు. చాంగ్‌చున్ లో ప్రస్తుతం లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు.

విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ మూతపడ్డాయి. రెండు రోజులకు ఒకసారి, ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావడానికి అనుమతిస్తున్నారు. చైనాలో వింటర్‌ ఒలింపిక్స్‌ సమయంలో కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకున్నారు. చైనాలో విజృంభిచేది ఒమిక్రాన్‌ వేరియెంట్‌ మాత్రమే అని, ఇది అంత ప్రమాదకరమైంది కాదని సైంటిస్టులు చెప్పడం ఊరటనిస్తోంది. ఇక హాంకాంగ్‌లో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇక్కడ ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. మరోవైపు దక్షిణ కొరియాలో రోజవారి కేసులు 3 లక్షల 83 వేల 665కి చేరడం భయాందోళనకు గురిచేస్తుంది.

ఇక భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. గత రెండేళ్లకుపైగా విజృంభించి ప్రస్తుతం అదుపులో ఉంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌, ఇతర ఆంక్షల కారణంగా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు చైనాలో మళ్లీ విజృంభిస్తుండటంతో మళ్లీ ఆందోళన వ్యక్తం అవుతోంది. మళ్లీ ఇక్కడ కూడా కేసులు పెరుగుతాయోమోనని భయాందోళన వ్యక్తం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం కరోనా కట్టడికి అన్ని చర్యలు చేపడుతున్నామని, ఫోర్త్‌వేవ్‌ వచ్చిన భయపడాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి:

Corona Virus: భారత్‌లో కరోనా మరణాలు తప్పులెక్కలన్న ది లాన్సెట్.. నివేదికపై అభ్యంతరం తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ

Coronavirus: దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. నిన్న 50లోపే మరణాలు.. ప్రస్తుతం ఎన్ని యాక్టివ్‌ కేసులున్నాయంటే..