China – srilanka: శ్రీలంకలో ముగిసిన చైనా విదేశాంగ మంత్రి పర్యటన.. కనిపించని డ్రాగన్ హామీలు.. ఎందుకంటే..?

China - srilanka: డ్రాగన్ దేశం పలు రంగాల్లో సాయం అందిస్తుందని శ్రీలంక ఆశించింది. అయినప్పటికీ ఎలాంటి హామీలు

China - srilanka: శ్రీలంకలో ముగిసిన చైనా విదేశాంగ మంత్రి పర్యటన.. కనిపించని డ్రాగన్ హామీలు.. ఎందుకంటే..?
Mahinda Rajapaksa

China – srilanka: డ్రాగన్ దేశం పలు రంగాల్లో సాయం అందిస్తుందని శ్రీలంక ఆశించింది. అయినప్పటికీ ఎలాంటి హామీలు లేకుండానే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి శ్రీలంక పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటనలో చైనా నుంచి పలు విషయాలపై వాగ్దానాలు కూడా రాకపోవడం ద్వీప దేశ నాయకులను కలవరపెడుతోంది. వాంగ్ యీ వారం రోజుల ద్వీప దేశాల పర్యటనలో ప్రధానంగా శ్రీలంకకు కలిసివస్తుందని భావించారు. అయినప్పటికీ.. పెద్దగా ఫలితం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. శ్రీలంకకు ఆర్థిక చేయూత.. కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సాయం ప్రకటను ఉంటుందని శ్రీలంక భావించింది. అయినప్పటికీ.. డ్రాగన్ కంట్రీ నుంచి ఎలాంటి వాగ్ధానాలు కనిపించలేదు.

వాంగ్ తన వారం రోజుల పర్యటన ముగిసే సమయానికి శ్రీలంకకు చేరుకున్నారు. అయితే బీజింగ్, ఎఫ్‌డిఐకి $5 బిలియన్ల లంక రుణాన్ని పునర్నిర్మించే హామీ రూపంలో బహుమతులు అందించనున్నట్లు వార్తలొచ్చాయి. దీంతోపాటు శ్రీలంక – చైనా ప్రాయోజిత మెగా ప్రాజెక్ట్‌లతో సహా ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం ఆర్థిక వ్యవస్థకు పునర్జీవం లభిస్తుందనుకున్న అలాంటి హామీలు లభించకపోవడం ద్వీపదేశాన్ని కలవరపెడుతోంది. భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతూనే డ్రాగన్ కంట్రీ వేరే దేశాలను ఆకట్టుకోవాలని చూస్తోంది. దీనిలో భాగంగా కరోనాతో ఆర్ధిక మాంద్యంలో కూరుకున్న శ్రీలంకకు చేయూత అందించకపోవడం భారత్‌కు కలిసివచ్చే విషయంగా మారనుంది. చైనీస్ పర్యాటకులను శ్రీలంకను సందర్శించేలా ప్రోత్సహించాలని, రాయితీతో కూడిన వాణిజ్య క్రెడిట్ వ్యవస్థ కోసం, తక్షణ చెల్లింపు లేకుండా శ్రీలంక క్లిష్టమైన సామాగ్రిని దిగుమతి చేసుకోవడానికి వీలు కల్పించాలని శ్రీలంక అధ్యక్షుడు చేసిన అభ్యర్థనకు కూడా వాంగ్ నుండి తక్షణ ప్రతిస్పందన రాలేదు.

వాంగ్‌ను కలిసిన తర్వాత గోటబయ సోదరుడు, ప్రధాన మంత్రి, మహింద రాజపక్స ట్వీట్ ముఖ్యమైనది. ఎందుకంటే చైనా వైపు నుండి ఎటువంటి వాగ్దానాలు లేదా హామీలు లేవు. చర్చలు మాత్రమే జరిగాయని పేర్కొన్నారు. చాలా మంది (లంక) వైద్య విద్యార్థులను చైనాకు తిరిగి వచ్చేలా చేసే విషయం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. కానీ ఈ చర్చలు పర్యాటకం, పెట్టుబడులు, కరోనా ఉపశమనం & కోవిడ్ అనంతర సంసిద్ధతపై దృష్టి సారించాయని మహింద్రా రాజపక్స ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ భేటీలో పర్యాటకరంగాన్ని ప్రోత్సహించడం, పెట్టుబడులు, కోవిడ్‌-19పై పోరాటం, ఇరు దేశాల దౌత్య సంబంధాల 65వ వార్షికోత్సవంపై చర్చించారు. శ్రీలంకకు మద్దతు కొనసాగిస్తున్నందుకు రాజపక్సే చైనా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల 65 ఏళ్ల వార్షికోత్సవం, శ్రీలంక-చైనా రబ్బర్‌ రైస్‌ ఒప్పందం 70 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా వాంగ్‌ యీ శ్రీలంకలో పర్యటించారు.

కాగా.. భారత్‌తో సయోధ్య కారణంగా ఎలాంటి వాగ్ధానాలు ఇవ్వలేదని పేర్కొంటున్నారు. మూడు ఉత్తర దీవుల్లో సోలార్ పార్క్ కోసం చైనా కంపెనీతో ఒప్పందం రద్దు చేసుకోవాలని శ్రీలంకను భారత్ కోరుతోంది. ఈ నేపథ్యంలో చైనా శ్రీలంకకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక సాయం కోసం భారత్‌ను అభ్యర్థించాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఆ దేశంలోని పలువురు పేర్కొంటున్నారు.

Also Read:

Plane Crash: రైలు పట్టాలపై విమానం ఎమర్జెన్సీ లాండింగ్‌… ఢీ కొట్టిన ట్రైన్.. వీడియో వైరల్‌

Vemuri Srinivas: రూ.10 వేల జీతం కోసం దుబాయ్ వచ్చి, కోటీశ్వరుడుగా మారిన మధ్యతరగతి తెలుగువాడు!

Published On - 3:43 pm, Tue, 11 January 22

Click on your DTH Provider to Add TV9 Telugu