AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా, తైవాన్‌ల మధ్య ఆగని వివాదం.. మరింత దూకుడు పెంచిన డ్రాగన్

చైనా, తైవాన్‌ల మధ్య ఎన్నో ఏళ్లుగా వివాదం కొనసాగుతూ వస్తుంది. తైవన్ తమ దేశంలోని భూభాగమే అంటూ చైనా ఎప్పటినుంచో వాదిస్తోంది. ఎలాగైన దాన్ని ఆక్రమించుకోవాలని తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి పరిణామాల మధ్య.. తాజాగా 24 గంటల వ్యవధిలోనే చైనా దేశపు సైన్యం ఏకంగా 103 యుద్ధ విమానాలను తైవాన్ దిశగా దింపడం గమనార్హం. అయితే వాటిలో దాదాపు 40 వరకు యుద్ధవిమానాలు.. తైవాన్ జలసంధి మధ్య రేఖను దాటినట్లు తైవాన్ రక్షణశాఖ ఆరోపణలు చేసింది.

చైనా, తైవాన్‌ల మధ్య ఆగని వివాదం.. మరింత దూకుడు పెంచిన డ్రాగన్
China
Aravind B
|

Updated on: Sep 18, 2023 | 6:21 PM

Share

చైనా, తైవాన్‌ల మధ్య ఎన్నో ఏళ్లుగా వివాదం కొనసాగుతూ వస్తుంది. తైవన్ తమ దేశంలోని భూభాగమే అంటూ చైనా ఎప్పటినుంచో వాదిస్తోంది. ఎలాగైన దాన్ని ఆక్రమించుకోవాలని తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి పరిణామాల మధ్య.. తాజాగా 24 గంటల వ్యవధిలోనే చైనా దేశపు సైన్యం ఏకంగా 103 యుద్ధ విమానాలను తైవాన్ దిశగా దింపడం గమనార్హం. అయితే వాటిలో దాదాపు 40 వరకు యుద్ధవిమానాలు.. తైవాన్ జలసంధి మధ్య రేఖను దాటినట్లు తైవాన్ రక్షణశాఖ ఆరోపణలు చేసింది. అయితే ఈ రేఖను ఇరుదేశాల మధ్య ఉన్నటువంటి అనధికారిక సరిహద్దుగా భావిస్తారు. అయితే ఇటీవలి కాలంలో చూస్తే.. అతిపెద్ద దుందుడుకు చర్య అని పేర్కొన్నటువంటి తైవాన్.. ఆ వ్యవధిలోనే ఏకంగా తొమ్మిది చైనాకు చెందిన నౌకలను గుర్తించినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. చైనా చర్యలను తైవాన్ రక్షణశాఖ కవ్వింపు చర్యలుగా అభివర్ణించింది.

అయితే ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణంలో ఇలాంటి మిలిటరీ విన్యాసాలతో కూడిన పరిస్థితులు ఇంకా మరింత దిగజారిపోయే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ తరహా ఘటనలకు బాధ్యత వహించడంతో సహా.. సైనిక కార్యకలాపాలను వెంటనే ఆపేయాలని సూచనలు చేసింది. అలాగే మరోవైపు.. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఈ వ్యవహారంపై మాట్లాడారు. అయితే అక్కడ మధ్య రేఖ అనేది ఏమి లేదని.. అసలు చెప్పాలంటే తైవాన్ కూడా చైనాలోని భాగమేనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు గతవారం కూడా చైనా.. తైవాన్ సమీప జలాల్లోకి విమాన వాహక నౌక షాన్‌డాంగ్‌తో పాటు యుద్ధనౌకల దండును పంపించింది. అలాగే.. తైవాన్‌కు తమ దేశంలో విలీనం చేసుకునేందుకు బీజింగ్ ఇటీవల ఓ ప్రణాళికను ఆవిష్కరణ చేసిన సంగతి తెలిసిందే.

అంతేకాదు.. చైనాలోని తీర ప్రావిన్స్ ఫుజియన్, తైవాన్‌ల మధ్య పరస్పరంగా ఉన్నటువంటి సహాకారాన్ని బలోపేతం చేసే విధంగా కొత్తగా ఓ బ్లూప్రింట్‌ను కూడా కూడా విడుదల చేసింది. అయితే వచ్చే ఏడాది జనవరిలో తైవాన్‌ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తమ ప్రణాళికలను ఆవిష్కరించడం గమనార్హం. ఇలాంటి పరిస్థితులు ఉన్న తరుణంలో తైవాన్ చట్టప్రతినిధి ఒకరు తన స్పందనను తెలియజేశారు. ఇది హాస్యాస్పదం అంటూ చైనా దేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎప్పటినుంచో చైనా.. తైవాన్‌ తమ దేశంలో భాగమే అని ప్రకటిస్తూ వస్తుంది. కానీ తైవాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమది స్వతంత్ర దేశమంటూ చెప్పుకుంటూ వస్తుంది. అంతేకాదు పలు దేశాలు కూడా చైనా చర్యలను వ్యతికేరిస్తున్నాయి. అయితే ఇటీవల తైవాన్‌ను విలీనం చేసుకునేందుకు పావులు కదపడం చర్చనీయాంశమవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..