AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనాలో ఇక పిల్లలకూ సైనోవాక్ వ్యాక్సిన్…. ..అత్యవసర వినియోగానికి ప్రభుత్వ అనుమతి….త్వరలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్

చైనాలో 3-17 ఏళ్ళ మధ్య వయస్సువారికి తమ వ్యాక్సిన్ ఇస్తామని సైనోవాక్ బయోటెక్ సంస్థ చైర్మన్ ఇన్ వీడాంగ్ ప్రకటించారు. దీని అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతించిందన్నారు.

చైనాలో ఇక పిల్లలకూ సైనోవాక్ వ్యాక్సిన్.... ..అత్యవసర వినియోగానికి ప్రభుత్వ అనుమతి....త్వరలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్
Sinovac Vaccine
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jun 05, 2021 | 3:01 PM

Share

చైనాలో 3-17 ఏళ్ళ మధ్య వయస్సువారికి తమ వ్యాక్సిన్ ఇస్తామని సైనోవాక్ బయోటెక్ సంస్థ చైర్మన్ ఇన్ వీడాంగ్ ప్రకటించారు. దీని అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతించిందన్నారు. దేశంలో మాస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద ఇప్పటివరకు 723.5 మిలియన్ డోసులను ప్రజలకు ఇచ్చినట్టు ఆయన వివరించారు. కానీ ఇది 18 అంతకంటే వయస్సు పైబడినవారికేనన్నారు. మా దేశ ఇనాక్యులేషన్ వ్యూహాల ప్రకారం.. వాటి ఆధారంగా యువ గ్రూపులకు సైనోవాక్ టీకామందును ఇస్తున్నాం…ఇక్కడ పెద్దవారితో పోలిస్తే పిల్లలకు తక్కువ ప్రయారిటీ ఉన్న విషయం గమనార్హం అన్నారు. ఇన్ఫెక్షన్ సోకిన అనంతరం వీరికి ఎక్కువ రిస్క్ ఉందని వీడాంగ్ పేర్కొన్నారు. సైనోవాక్ తొలి. రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా..3 నుంచి 17 ఏళ్ళ మధ్య వయస్సువారిలో నిరోధక శక్తి పెరిగినట్టు తేలిందని, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువేనని వెల్లడైందని ఆయన చెప్పారు. కాగా- ప్రభుత్వ ఆధ్వర్యంలోని సైనోఫామ్ కంపెనీ.. సైనోవాక్ వ్యాక్సిన్ సంబంధ టెక్నాలజీనే వినియోగిస్తూ రెగ్యులేటరీ అనుమతి కోసం డేటాను సమర్పించింది. ఇదే సమయంలో క్యాన్సినో బయలాజికల్ అనే సంస్థ మరో విభిన్నమైన టెక్నాలజీని వినియోగించి 6 నుంచి 17 ఏళ్ళ మధ్య వయసున్న వారిపై రెండో దశ ట్రయల్ కి శ్రీకారం చుట్టింది. అటు- సైనోవాక్.. మూడో బూస్టర్ కోసం రెండో క్లినికల్ ట్రయల్ ని పూర్తి చేసిందని ఈ సంస్థ చైర్మన్ వెల్లడించారు. గతంతో పోలిస్తే వారం రోజుల్లోనే ఈవలంటీర్లలో యాంటీ బాడీల స్థాయులు పది రెట్లు పెరిగాయన్నారు.

మూడో డోసు సైనోవాక్ ఇచ్చే యోచన కూడా ఉందని, అయితే దీనివల్ల యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయన్నది తేలాల్సి ఉందని ఇన్ డాంగ్ చెప్పారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Google Chrome: గూగుల్ క్రోమ్ ఇక పై మరింత సురక్షితం.. అనవసర ఫైళ్ళు డౌన్ లోడ్ చేయకుండా వార్నింగ్ అలారం!

SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. జూలై 1 నుంచి ఈ రూల్స్‌ మారనున్నాయి.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు