చిలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదు.. పలుచోట్ల విరిగిపడ్డ కొండచరియలు, నిలిచిన విద్యుత్ సరఫరా
దక్షిణ అమెరికాలో భూకంపం వణికించింది. చిలీలో భారీ భూకంపం సంభవించింది. నిన్న రాత్రి ఉత్తర చిలీలోని లాస్ లాగోస్ తీరప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదయ్యిందని అధికారులు వెల్లడించారు.

దక్షిణ అమెరికాలో భూకంపం వణికించింది. చిలీలో భారీ భూకంపం సంభవించింది. నిన్న రాత్రి ఉత్తర చిలీలోని లాస్ లాగోస్ తీరప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదయ్యిందని అధికారులు వెల్లడించారు. కోరల్ నగరానికి 140 కి.మీ. దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలాజికల్ సెంటర్ (ఈఎంఎస్‌సీ) వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ చిలీ తీరప్రాంతంలోని అనేక నగరాల్లో భూ ప్రకంపణలు కనిపించాయి. లాఅరౌకనియా, లాస్‌రియోస్, లాస్‌లాగోస్, బియోబియోలో భూమి కంపించింది. అయితే, ఈ భారీ భూకంపం వల్ల సునామీ వచ్చే ప్రమాదం ఏమీలేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం స్పష్టం చేసింది. పసిఫిక్ తీర దేశాలకు ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో అంతర్గత విద్యుత్తు అంతరాయాలు ఏర్పడ్డాయని, కొండచరియలు విరిగిపడి రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ అత్యవసర కార్యాలయం తెలిపింది. కాగా, వాల్డివియా, దాని సమీప ప్రాంతాల్లో ఆరువేల మందివరకు గాయపడినట్లు యూఎస్‌జీఎస్ వెల్లడించింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. చిలీలో 2011లో తర్వాత ఇదే అతి పెద్ద భూకంపంగా అధికారులు అంచనా వేస్తున్నారు.
A strong and shallow Earthquake Hits off the Coast of Chile!#ChileEarthquake pic.twitter.com/dclHA51mOt
— Dahboo7 (@dahboo7) December 27, 2020
