మరో కీలక నిర్ణయం తీసుకున్న కువైట్ సర్కార్.. విదేశీ ఉపాధ్యాయులకు కొత్త వీసాలు జారీ..

కరోనా రాకాసి కోరల్లో చిక్కుకున్న ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు విద్యా సంస్థలు సైతం మూతబడ్డాయి. దీంతో విదేశాలకు చెందిన అధ్యాపకులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు.

మరో కీలక నిర్ణయం తీసుకున్న కువైట్ సర్కార్.. విదేశీ ఉపాధ్యాయులకు కొత్త వీసాలు జారీ..
Follow us

|

Updated on: Dec 27, 2020 | 9:11 PM

కరోనా రాకాసి కోరల్లో చిక్కుకున్న ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు విద్యా సంస్థలు సైతం మూతబడ్డాయి. దీంతో విదేశాలకు చెందిన అధ్యాపకులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇదే క్రమంలో కువైట్ దేశంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా సొంత దేశాలకు చేరుకున్నారు. ఇలా చాలా మంది టీచర్లు కొవిడ్-19 విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవడం వల్ల మార్చి నుంచి వారి దేశాల్లోనే ఉండిపోయారు. అయితే, ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం, కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న నేపథ్యంలో తిరిగి వారిని కువైట్‌కు రప్పించాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కరోనా వల్ల విదేశాల్లో చిక్కుకున్న టీచర్లను వెనక్కు రావాలని కువైట్ సర్కార్ కోరింది. విదేశీ ఉపాధ్యయులు తిరిగి కువైట్‌లో ప్రవేశించేందుకు కొత్త వీసాలు జారీ చేయనున్నట్లు ఆ దేశ విద్యాశాఖ వెల్లడించింది. కోవిడ్ కారణంగా రాకపోకలు నిలిచిపోవడంతో.. కువైట్ నేరుగా ప్రవేశం కల్పించని 35 దేశాలకు చెందిన ఉపాధ్యయులు అయా దేశాల్లో చిక్కుకుపోయారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ముందుకువచ్చింది.

విదేశాల్లో చిక్కుకున్న టీచర్లను కువైట్ రప్పించేందుకు కొత్త వీసాల జారీ ప్రక్రియకు ఆదేశ ప్రభుత్వాన్ని ఒప్పించింది విద్యాశాఖ. దీంతో వీసా గడువు ముగిసిన సుమారు 330 మంది ప్రవాస ఉపాధ్యయులకు కొత్త వీసాల జారీ చేయనున్నారు. వీరు త్వరలోనే కువైట్ వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ప్రధానంగా ఐదు సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయులు మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, మ్యూజిక్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు కొత్త వీసాలపై కువైట్ వెళ్లవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కాగా, విదేశీ టీచర్లకు కువైట్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆగస్టు నుంచి రెసిడెన్సీ పర్మిట్లను రెన్యూవల్ చేయడం నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా కొత్త వీసాల ద్వారా ప్రవేశానికి అనుమతి ఇవ్వడం విదేశీ టీచర్లకు పెద్ద ఊరట అని చెప్పొచ్చు.

పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే