Viral: ఇదేందిది సామీ.. మహిళకు ఎక్స్‌రే తీసిన డాక్టర్లకు మైండ్ బ్లాంక్.. అసలు మ్యాటర్ తెలిస్తే షాకే!

ఇదేందిది సామీ.. మనం చేసే చిన్న చిన్న పనులే.. డేంజర్ తెచ్చిపెడితే.. ఇంకెలా మరి.. సాధారణంగా చాలామంది...

Viral: ఇదేందిది సామీ.. మహిళకు ఎక్స్‌రే తీసిన డాక్టర్లకు మైండ్ బ్లాంక్.. అసలు మ్యాటర్ తెలిస్తే షాకే!
Viral News
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 31, 2023 | 7:00 PM

ఇదేందిది సామీ.. మనం చేసే చిన్న చిన్న పనులే.. డేంజర్ తెచ్చిపెడితే.. ఇంకెలా మరి.. సాధారణంగా చాలామంది బయటకి వెళ్లేటప్పుడు తాళాలు లాంటివి మర్చిపోతే.. తన ఫ్రెండ్ లేదా కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకర్ని లోపల నుంచి బయటకు విసిరేయమని.. వాటిని క్యాచ్ పట్టుకుంటుంటారు. సరిగ్గా ఇలాంటి ఓ సంఘటనే కెనడాలో చోటు చేసుకుంది. మరి ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.?

స్థానికంగా ఉన్న ఓ 24 ఏళ్ల కెనడియన్ మహిళ రెనీ లారివియర్ తన స్నేహితులతో డిన్నర్ కోసం బయటకు వెళ్తూ ఓ విచిత్రమైన ప్రమాదానికి గురవుతుంది. పార్టీకి వెళ్లే క్రమంలో కారు తాళం మర్చిపోయిన రెనీ.. తన గదిలో ఉన్న కీని కుటుంబసభ్యులను బయటకు విసరమని చెప్పింది. అలా విసిరిన తాళాన్ని పట్టుకునే క్రమంలో ఆ కీ కాస్తా నేరుగా ఆమె ముఖంపై గుచ్చుకుంది. దాన్ని బయటికి తీసేందుకు సదరు యువతి స్నేహితులు ప్రయత్నించగా.. తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక అక్కడి డాక్టర్లు ఎక్స్‌రే తీయగా.. ఆ కీ ఆమె కంటి కింద చెంపలోకి అంగుళంన్నర లోతుగా దిగినట్లు గుర్తించారు. అనంతరం ఒక శస్త్రచికిత్స ద్వారా దాన్ని తొలగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం