Covid-19 Vaccine: ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. ఆ కోవిడ్ వ్యాక్సిన్ 60 ఏళ్లు పైబడిన వారికే.. ఎందుకంటే..?

AstraZeneca Vaccine: ప్రపంచ వ్యాప్తంగా కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ తరుణంలో కూడా వ్యాక్సిన్లపై పలు అపోహాలు మాయనిమచ్చలా

Covid-19 Vaccine: ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. ఆ కోవిడ్ వ్యాక్సిన్ 60 ఏళ్లు పైబడిన వారికే.. ఎందుకంటే..?
astrazeneca vaccine
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 17, 2021 | 3:50 PM

AstraZeneca Vaccine: ప్రపంచ వ్యాప్తంగా కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ తరుణంలో కూడా వ్యాక్సిన్లపై పలు అపోహాలు మాయనిమచ్చలా వెంటాడుతున్నాయి. ఆస్ట్రాజెనెకా – ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే పరిమితం చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వయోధికులకు మాత్రమే ఈ టీకా వేయాలంటూ దేశంలోని ఆసుపత్రులకు తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో ఈ టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకడుతున్న కేసులు వెలుగు చూడటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఆస్ట్రేలియాలో ఇప్పటివరకూ 30 లక్షల పైచిలుకు ఆస్ట్రాజెనెకా టీకా డోసులను వేశారు. ఈ క్రమంలో 60 మందిలో రక్తం గడ్డ కట్టిన కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరిలో ఇద్దరు మృతి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ టీకా తీసుకున్న అనంతరం ఇటీవల 52 ఏళ్ల మహిళకు మెదడులో రక్తం గడ్డకట్టి చనిపోయింది. అంతకుముందు ఏప్రిల్ లో 42 ఏళ్ల మహిళ మృతిచెందింది. దీంతో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను 50 నుంచి 60కి పైగా వయస్సు ఉన్నవారికి సిఫారసు చేసినట్లు ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ తెలిపారు. అయితే 60 కి తక్కువగా వయస్సు ఉన్న వారికి ఫైజర్ వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఇదిలాఉంటే.. . ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం చాలా దేశాల్లో రక్తం గడ్డ కట్టడం లాంటి కేసులు నమోదయ్యాయి. దీంతో పలు ఐరోపా దేశాలు ఆస్ట్రాజెనెకా టీకా వినియోగాన్ని రద్దు చేయగా.. మరికొన్ని వయోధికులకు మాత్రమే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే.. ఈ టీకా కారణంగా అత్యధికంగా యువతలో రక్తం గడ్డకడుతోందన్న పలు అనుమానాల నేపథ్యంలో ఐరోపా దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

Also Read:

Twitter Story: ట్విట్టర్ మొండి పట్టుదలకు కారణం ఏమిటి? ఎందుకు భారత ప్రభుత్వం మాట లెక్కచేయడం లేదు?

AP Tenth Exams: జూలై 26 నుంచి ఏపీలో టెన్త్ పరీక్షలు.. 11 పేపర్లు బదులుగా ఏడు పేపర్లే.!

పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో