Helping others: ఇతరులకు సహాయం చేసే ప్రజల్లో పేద దేశాలే టాప్.. భారత్ ర్యాంక్ 14.. ధనిక దేశాలు కింది వరుసలో!

Helping others: కరోనా మహమ్మారి ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు తీసుకువచ్చింది. అనారోగ్యాన్ని కలిగించి ప్రాణాలు తోడేసిన కరోనా ప్రజల్లో కొన్ని మంచి అలవాట్లను నేర్పింది.

Helping others: ఇతరులకు సహాయం చేసే ప్రజల్లో పేద దేశాలే టాప్.. భారత్ ర్యాంక్ 14.. ధనిక దేశాలు కింది వరుసలో!
Helping Others
Follow us
KVD Varma

|

Updated on: Jun 17, 2021 | 4:31 PM

Helping others: కరోనా మహమ్మారి ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు తీసుకువచ్చింది. అనారోగ్యాన్ని కలిగించి ప్రాణాలు తోడేసిన కరోనా ప్రజల్లో కొన్ని మంచి అలవాట్లను నేర్పింది. అంతేకాదు తోటివారికి సహాయం చేయడమనే ధోరణిని పెంచింది. ఈ విషయాన్ని బ్రిటీష్ సంస్థ ఛారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021 చెబుతోంది. 2020 లో, ప్రపంచంలోని 55% మంది పెద్దలు అంటే సుమారు 300 మిలియన్ల మంది తమకు తెలియని వ్యక్తులకు సహాయం చేశారు. 31% మంది ప్రజలు నగదు రూపంలో విరాళాలు ఇచ్చారు. ప్రపంచంలోని ప్రతి 5 వ వ్యక్తి స్వచ్ఛందంగా సామాజిక సేవలో గడపడానికి ముందుకొచ్చారు. ఈ సంస్థ 114 దేశాలలో సర్వేలు నిర్వహించింది. ఇందులో, అన్ని దేశాలు 3 అంశాలపై స్పష్టతను ఇచ్చాయి. తెలియని వ్యక్తికి సహాయం చేయడం, నగదు విరాళం ఇవ్వడం అదేవిధంగా వారి సమయాన్ని ఇవ్వడం ద్వారా సామాజిక సేవ చేసే ధోరణి.

ఇందుకోసం గాలప్ ప్రతి దేశంలో కనీసం వెయ్యి మందిని ఇంటర్వ్యూ చేశారు. 114 దేశాల్లో మొత్తం 1.21 లక్షల మందిని ఇంటర్వ్యూ చేశారు. ఈ సూచికలో ఇండోనేషియా అత్యంత ఉదారవాద దేశంగా నిలిచింది. ఇక్కడి 83% మంది నగదును విరాళంగా ఇచ్చారు. కార్మిక విరాళానికి సమయం ఇవ్వడంలో, సమాజంలోని ప్రజలకు సహాయం చేయడంలో ఇండోనేషియా (60%) ముందువరుసలో నిలిచింది. నగదు దాతలలో మయన్మార్ రెండవ స్థానంలో ఉంది. ఇక్కడి బౌద్ధమతానికి చెందిన థెరావాడా శాఖ ముందుంది. ఈ సర్వేలో తేలిన ప్రత్యేక విషయం ఏమిటంటే, ధనిక దేశాల కంటే పేద దేశాల ప్రజలలో ఇతరులకు సహాయం చేసే ధోరణి ఎక్కువగా ఉంది. ఎప్పుడూ టాప్ -10 లో స్థానం సంపాదించిన యుఎస్, యుకె, ఐర్లాండ్, కెనడా మరియు నెదర్లాండ్స్ ర్యాంకింగ్స్‌లో జారిపోయాయి, టాప్ -5 నుంచి యుఎస్ 19 వ స్థానానికి పడిపోయింది.

అపరిచితులకు సహాయపడే టాప్ 10 దేశాలలో ఆరు ఆఫ్రికన్ – నైజీరియా, కామెరూన్, జాంబియా, కెన్యా, ఉగాండా, ఈజిప్ట్ కావడం చెప్పుకోదగింది. ఇవన్నీ పేద దేశాలుగా చెప్పుకోవచ్చు. ఈ విభాగంలో జపాన్ చివరి స్థానంలో ఉంది. యూరోపియన్ దేశాలు బెల్జియం, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, స్లోవేనియా, ఇటలీ, నెదర్లాండ్స్, ఐస్లాండ్ కూడా తెలియని వ్యక్తులకు సహాయం చేయడానికి తక్కువ ఆసక్తిని చూపించాయి. జపాన్, మాలి వంటి సంపన్న దేశాలు విరాళం ఇవ్వడంలో చాలా వెనుకబడి ఉన్నాయి.

14వ ర్యాంక్ లో భారత్..

గత కొన్నేళ్లుగా ఈ సూచికలో భారత్ 82 వ స్థానంలో ఉంది, కానీ 2020 లో ఇది 14 వ స్థానానికి చేరుకుంది. ఇండెక్స్ లోని వివిధ కేటగిరీలలో భారత్ ఎలా ఉందనేది పరిశీలిస్తే.. సామాజిక సేవకు సమయం ఇవ్వడంలో భారతదేశం 6 వ స్థానంలో, నగదు విరాళంలో 35 వ స్థానంలో.. అపరిచితులకు సహాయం చేయడంలో 41 వ స్థానంలో ఉంది.

టాప్ -15 దేశాలు (మొత్తం ర్యాంకింగ్)

1. ఇండోనేషియా, 2. కెన్యా, 3. నైజీరియా, 4. మయన్మార్, 5. ఆస్ట్రేలియా, 6. ఘనా, 7. న్యూజిలాండ్, 8. ఉగాండా, 9. కొసోవా, 10. థాయిలాండ్, 11 . తజికిస్తాన్, 12. బహ్రెయిన్, 13. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 14. ఇండియా, 15. ఇథియోపియా.

Also Read: Viral Video: పెళ్ళి భోజనం లాగిస్తోన్న అమ్మాయి.. అంతలోనే బ్రేక్‌.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు.!

Aloe Vera Juice Benefits: క‌ల‌బంద గుజ్జుతో ఎన్నో లాభాలు.. కీళ్ల నొప్పుల నుంచి దంతాల సంర‌క్ష‌ణ వ‌ర‌కు..