ఇక నుంచి ప్యారిస్‌లో మాస్కులు కంపల్సరీ

ఫ్రాన్స్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకీ అనూహ్యంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠినచర్యలకు దిగింది.. ఇప్పటి వరకేమోగానీ, ఇక నుంచి మాత్రం రాజధాని ప్యారిస్‌లో మాస్క్‌లు లేకుండా తిరగకూడదని ఆదేశించింది. ఒక్క ప్యారిసే కాదు, చుట్టు పక్కల ప్రాంతాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.

ఇక నుంచి ప్యారిస్‌లో మాస్కులు కంపల్సరీ
Follow us

|

Updated on: Aug 28, 2020 | 1:06 PM

ఫ్రాన్స్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకీ అనూహ్యంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠినచర్యలకు దిగింది.. ఇప్పటి వరకేమోగానీ, ఇక నుంచి మాత్రం రాజధాని ప్యారిస్‌లో మాస్క్‌లు లేకుండా తిరగకూడదని ఆదేశించింది. ఒక్క ప్యారిసే కాదు, చుట్టు పక్కల ప్రాంతాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 6,111 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఫ్రాన్స్‌ ప్రభుత్వం నివారణ చర్యలకు దిగింది.. మే నెల తర్వాత ఫ్రాన్స్‌లో ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగా ప్రకటించి, అక్కడ మాత్రం లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేశారు ఫ్రాన్స్‌ అధికారులు.. ముందు రెడ్‌జోన్‌ల సంఖ్య రెండు ఉంటే ఇప్పుడా సంఖ్య 21కి చేరింది.. ప్రధానమంత్రి జీన్‌ కాస్టెక్స్‌ కరోనా వ్యాప్తి విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు.. మరోసారి లాక్‌డౌన్‌ను విధించకూడదన్నది తన ఉద్దేశమని, ఇప్పటికైనా ప్రజలంతా స్వీయ నియంత్రణను పాటిస్తే మంచిదని సూచించారు. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఫ్రాన్స్‌ అంతటా కరోనా వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు ఏ మాత్రం అలసత్వం కనబర్చకూడదని చెప్పారు ప్రధాని.

కరోనా పాజిటివ్‌ కేసులు గణనీయంగా పెరిగినప్పటికీ, రోజువారి మరణాల సంఖ్య తక్కువగానే ఉండటమే కాసింత ఊరట కలిగించే విషయం ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో కరోనా వ్యాధితో 30,500 మంది మరణించారు.. సుమారు మూడు లక్షల మందికి కరోనా వైరస్‌ సోకింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ప్రధాని ఆదేశించారు.. ఒకవేళ ఎవరైనా ఈ నియమాన్ని తప్పితే వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలలో మాస్క్‌లు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించే వారు కూడా మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వం తెలిపింది. మాస్క్‌లు ధరించడం జీవితంలో ఓ భాగంగా మారిపోయిందిప్పుడు.. నియమాలను ఉల్లఘించేవారిపై జరిమాన విధిస్తామని పేర్కొంది..