సెక్స్ చేస్తూ జూమ్ లైవ్‌లో అడ్డంగా దొరికిన ప్రభుత్వ అధికారి
వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమోగానీ.. ఈ దెబ్బతో కొంతమంది అధికారుల అవలక్షణాలన్నీ బయటపడుతున్నాయి.. కెమెరా ముందు ఉన్నామో లేమో పట్టించుకోకుండా అడ్డమైన పనులన్నీ చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమోగానీ.. ఈ దెబ్బతో కొంతమంది అధికారుల అవలక్షణాలన్నీ బయటపడుతున్నాయి.. కెమెరా ముందు ఉన్నామో లేమో పట్టించుకోకుండా అడ్డమైన పనులన్నీ చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు.. ఫిలిప్పిన్స్‌లోని మనీలాలో ఇలాగే తన సెక్రటరీతో జూమ్ లైవ్‌లో సెక్స్‌లో పాల్గొంటూ దొరికిపోయాడో ప్రభుత్వ అధికారి.. కామాతురానం న భయం న లజ్జ అంటారు కానీ కొన్నిసార్లు బుర్ర కూడా పనిచేయదు.. అలా పని చేయకపోవడం వల్లే ఈ పాడుపనికి పూనుకున్నాడు.. ఉద్యోగం ఊడగొట్టుకున్నాడు.. మొన్న బుధవారం జరిగిందీ ఘటన.. జీసన్ ఎస్టిల్ అనే ఓ అధికారి తన గ్రామ కౌన్సిల్ సభ్యులతో జూమ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.. ఆయనకు టెక్నాలజీ మీద అంతగా పట్టులేదు.. కాన్ఫరెన్స్ అంతా అయ్యాక ఓ బటన్‌కు బదులు మరో మీట నొక్కేసి అంతా ఆఫ్ అయ్యిందనుకున్నాడు.. కెమెరా మాత్రం రన్నింగ్‌లో ఉందన్న సంగతి తెలుసుకోలేకపోయాడు.. అటు పిమ్మట తన సెక్రటరీతో శృంగారంలో పాల్గొన్నాడు.. ఇదంతా జూమ్ లైవ్‌లో ఉన్నవారికి స్పష్టంగా కనిపిస్తున్నా… అతడికి మాత్రం ఆ విషయం తెలియలేదు.. కాసేపయ్యాక సెక్రటరీకి ఎందుకో అనుమానం వచ్చేసి అతడికి విషయం చెప్పింది.. వెంటనే తేరుకున్న ఆ పెద్దమనిషి కెమెరా ఆఫ్ చేశాడు.. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది.. ఇలాంటి సందర్భాలను వదలని వారు కూడా ఉంటారు.. అలాంటివారే జూమ్‌లైవ్‌లో ఉన్న ఆ సీన్‌లను వీడియో తీశారు.. తీసినవారు గమ్మున ఉండరు కదా! సోషల్ మీడియాలలో పోస్ట్ చేశారు.. ఇది కాస్తా వైరలయ్యింది.. ఇది తెలుసుకున్న ఉన్నతాధికారులు ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించేశారు.. అయినా ఇంత జరిగాక వారు మాత్రం ఏ మొహం పెట్టుకుని ఉద్యోగాలకు వస్తారు చెప్పండి..!