నాల్గవ బిడ్డకు జన్మనివ్వబోతున్న అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ – ఉషా వాన్స్
అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్, ఆయన భార్య తెలుగింటి ఆడపడచు ఉషా వాన్స్ ఈ ఏడాది జూలై చివరిలో తమ నాల్గవ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. "ఉష గర్భవతి అని, జూలైలో మా నాల్గవ బిడ్డకు జన్మనివ్వబోతున్నామని వార్తలను పంచుకోవడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఉష, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. జూలై చివరిలో కొత్త వారసుడిని స్వాగతించడానికి మేమందరం ఉత్సాహంగా ఉన్నాము" అని వాన్స్ దంపతులు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్, ఆయన భార్య తెలుగింటి ఆడపడచు ఉషా వాన్స్ ఈ ఏడాది జూలై చివరిలో తమ నాల్గవ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. “ఉష గర్భవతి అని, జూలైలో మా నాల్గవ బిడ్డకు జన్మనివ్వబోతున్నామని వార్తలను పంచుకోవడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఉష, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. జూలై చివరిలో కొత్త వారసుడిని స్వాగతించడానికి మేమందరం ఉత్సాహంగా ఉన్నాము” అని వాన్స్ దంపతులు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.
“ఈ ఉత్తేజకరమైన, బిజీగా ఉండే సమయంలో, మా కుటుంబానికి అద్భుతమైన సంరక్షణ అందించే సైనిక వైద్యులకు, మా పిల్లలతో సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తూ మన దేశానికి సేవ చేయగలమని నిర్ధారించుకోవడానికి అన్ని విధాలుగా కృషి చేసే సిబ్బందికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము” అని ప్రకటనలో పేర్కొన్నారు.
చరిత్రలో అత్యంత కుటుంబ అనుకూల పరిపాలన అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)లో రాస్తూ వైట్ హౌస్ వాన్స్ జంటను అభినందించింది! కాగా, తెలుగింటి ఆడపడుచు అయిన ఉషా వాన్స్ (40), జె.డి. వాన్స్ (41) యేల్ లా స్కూల్‌లో చదువుతున్నప్పుడు కలుసుకున్నారు. వారి ప్రేమ పెళ్లిగా మారింది. వారికి ముగ్గురు పిల్లలు. ఇవాన్ (8), వివేక్ (5), మిరాబెల్లె (4). గత సంవత్సరం ఏప్రిల్‌లో తన మొదటి అధికారిక పర్యటనలో వాన్స్ భారతదేశాన్ని సందర్శించారు. ఉషా వాన్స్ వారి ముగ్గురు పిల్లలతో కలిసి. వాన్స్ కుటుంబం ఏప్రిల్ 21 నుండి 24 వరకు భారతదేశంలో పర్యటంచింది. ఆ సమయంలో వారు ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన తర్వాత జైపూర్, ఆగ్రాలను సందర్శించారు.
ఉషా చిలుకూరి వాన్స్ తెలుగు సంతతికి చెందిన మహిళ. ఆమె తండ్రి క్రిష్, తల్లి పేరు లక్ష్మీ. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన ఉష పూర్వీకులు రెండు తరాల మందు హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఆమె నానమ్మ, తాతయ్యలు హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. కొన్నేళ్లకు ఉషా చిలుకూరి తల్లితండ్రులు హైదరాబాద్ నుంచి అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. ఉషా చిలుకూరి తండ్రి ఫిజీషియన్‌గా చేసి రిటైర్ అయ్యారు. ఉషా వాన్స్ వృత్తిరీత్యా న్యాయవాది. యు.ఎస్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ జి. రాబర్ట్స్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ కోసం అప్పటి కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ న్యాయమూర్తి బ్రెట్ కవనాగ్ వద్ద లా క్లర్క్‌గా పనిచేశారు. ఆమె యేల్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పొందారు. అక్కడ ఆమె గేట్స్ కేంబ్రిడ్జ్ స్కాలర్‌గా ఉన్నారు.
జేడీ వాన్స్ అమెరికాలో తగ్గుతున్న జనన రేటు గురించి చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2021లో ఒహియో నుండి యుఎస్ సెనేట్‌కు పోటీ చేసినప్పుడు కూడా ఆయన ఈ అంశాన్ని హైలైట్ చేశారు. వైస్ ప్రెసిడెంట్‌గా, మార్చి 2025లో జరిగిన మార్చ్ ఫర్ లైఫ్ కార్యక్రమంలో “నేను అమెరికాలో పిల్లలు పుట్టడాన్ని పెంచాలి.. జనాభా పెరగాలి” అని చెబుతూ ఆయన ఈ ప్రచారాన్ని కొనసాగించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
