AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EB-1A: ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలనకునే వారికి H-1B వీసా కచ్చితంగా కావాల్సి ఉంటుంది. అయితే ఈ వీసా జారీ విషయంలో అమెరికా తీసుకున్న కఠిన నిర్ణయాల తర్వాత H-1B వీసా పొందడం, దరఖాస్తుదారులు కష్టతరం అయిపోయాయి. దీంతో చాలా మంది 'ఐన్‌స్టీన్ వీసా' అని పిలువబడే EB-1A పై ఆసక్తి చూపుతున్నారు. ఇంతకు ఈ ఇన్‌స్టీన్ వీసా అంటే ఏమిది, దీన్ని ఎవరు పొందవచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం.

EB-1A: ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
Eb 1a Visa Requirements
Anand T
|

Updated on: Jan 21, 2026 | 12:09 PM

Share

EB-1 అనేది ఒక ప్రత్యేకమైన వీసా వర్గం. దీనినే ఐన్‌స్టీన్‌ను ఎంప్లాయిమెంట్‌ బేస్డ్‌ ఇమిగ్రేషన్‌ (EB-1)వీసా అని అంటారు. అమెరికా సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీస్‌ పోర్టల్‌ EB-1 వీసా వివరాల ప్రకారం.. సైన్స్‌, ఆర్ట్స్‌, ఎడ్యుకేషన్‌, బిజినెస్‌, అథ్లెట్‌ వంటి రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిపుణులైన వారికి మాత్రమే ఈ వీసా జారీ చేయబడుతుంది. ఇది ఇతర వీసా రకాల నుండి చాలా భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే EB-1Aకు దరఖాస్తు చేసుకునేవారికి యజమాని స్పాన్సర్ అవసరం లేకుండా యునైటెడ్ స్టేట్స్‌లో శాశ్వత నివాసం కోసం స్వీయ-పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది.

మూడు రెట్లు పెరిగిన డిమాండ్

యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డేటా ప్రకారం, గత నాలుగు సంవత్సరాలలో EB-1 వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. అంటే అమెరికాకు వలస వెళ్లాలనుకునే వారు ఎక్కువగా ఈ వీసాపై ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. 2021లో ఈ వీసా కోసం కేవలం 2,500 దరఖాస్తులు రాగా.. గత ఏప్రిల్, జూన్ నెల మధ్య మాత్రమే ఈ ధరఖాస్తుల సంఖ్య 7,500కు చేరింది. కానీ దరఖాస్తుల ఆమోదం మాత్రం 67% నుండి దాదాపు 50%కి తగింది. డిమాండ్ పెరగడంతో దరఖాస్తుల పరీశీలనను మరింత కఠినతరం చేస్తున్నట్టు ఇది తెలియజేస్తుంది.

EB-1 వీసాను ఎవరు పొందవచ్చు?

ఐన్‌స్టీన్ వీసా’ అనేది అనధికారిక పదం దీనిని US ప్రభుత్వం ఉపయోగించదు. USCIS ప్రకారం.. ఒక దరఖాస్తుదారుడు ఈ వీసాను పొందాలంటే ఈ క్రింది వర్గాలకు చెంది ఉండాలి

  • EB-1A: అసాధారణ సామర్థ్యం ఉన్న వ్యక్తి అయితే ఈ వీసాను పొందవచ్చు
  • EB-1B: ఒక అత్యుత్తమ ప్రొఫెసర్ లేదా పరిశోధకుడు అయితే అతను ఈ వీసాకు అర్హుడు
  • EB-1C: ఒక నిర్దిష్ట బహుళజాతి కార్యనిర్వాహకుడు లేదా మేనేజర్ అయితే అతను ఈ వీసాను పొందవచ్చు.

ఇది యునైటెడ్ స్టేట్స్‌లో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కోసం EB-1 కేటగిరీలోని ఒక ఉపవర్గం. అర్హత పొందడానికి రెండు మార్గాలు ఉన్నాయి: ఒకసారి సాధించిన ప్రధాన అంతర్జాతీయ అవార్డు, ఉదాహరణకు పులిట్జర్ బహుమతి, ఆస్కార్ లేదా ఒలింపిక్ పతకం వంటివి ఆధారాలు సమర్పించడం లేదా USCIS నిర్దేశించిన 10 ప్రమాణాలలో కనీసం 3 ను తీర్చడం.

EB-1 వీసా కోసం ఎలా ధరఖాస్తు చేసుకోవాలి

మీకు ఎలాంటి ప్రత్యేక స్కిల్స్ లేని వర్గానికి చెందినవారైతే మీరు EB-1A కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు విదేశీ కార్మికుడి కోసం ఫారమ్ i-140 పిటిషన్‌ను సమర్పించి ఈ వీసా కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. EB-1 వీసా కోసం దాఖలు చేయడానికి EB-1B , EB-1C వేర్వేరు ప్రక్రియలను కలిగి ఉంటాయి. EB-1 పిటిషన్ ఆమోదించబడితే, దరఖాస్తుదారుడి జీవిత భాగస్వామి , 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అవివాహిత పిల్లలు కూడా యునైటెడ్ స్టేట్స్‌లో డిపెండెంట్లుగా ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కావచ్చు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..