Pig Heart Transplant: 40 రోజుల క్రితం పంది గుండె మార్పిడి.. మృత్యుంజయుడనుకున్న వ్యక్తి చివరకు..

సాధారణంగా మనం వ్యక్తుల నుంచి వ్యక్తులకు అవయవదానం చేయడం చూస్తూ ఉంటాము. అంత స్థాయిలేని వారు రక్తదానం చేస్తూ ఉంటారు. కోవిడ్ తరువాత బ్లెడ్ సెల్స్ దానం చేయడం వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా ఒక వ్యక్తికి పంది నుంచి తీసిన గుండెను అమర్చారు. ఇలా చేసిన శాస్త్ర చికిత్సలో గుండెను అమర్చిన వ్యక్తి సుమారు 40 రోజుల పాటూ బ్రతికారు. అయితే గత కొన్ని రోజులుగా గుండె స్పందనలో క్రమ క్రమంగా మార్పులు చోటు చేసుకున్నాయి.

Pig Heart Transplant: 40 రోజుల క్రితం పంది గుండె మార్పిడి.. మృత్యుంజయుడనుకున్న వ్యక్తి చివరకు..
American Recipient Of The Pig Heart Transplant Dies Forty Days LaterImage Credit source: Medschool.Umaryland.Edu
Follow us
Srikar T

|

Updated on: Nov 01, 2023 | 4:20 PM

సాధారణంగా మనం వ్యక్తుల నుంచి వ్యక్తులకు అవయవ మార్పిడి చేయడం చూస్తూ ఉంటాము.  కోవిడ్ తరువాత బ్లెడ్ సెల్స్ మార్పిడి చేయడం వెలుగులోకి వచ్చింది. అయితే ఇటీవల ఒక వ్యక్తికి పంది నుంచి తీసిన గుండెను అమర్చారు. వైద్య చరిత్రలో ఇదో పెద్ద సంచలనంగా ప్రపంచవ్యాప్త చర్చ జరిగింది. ఇలా చేసిన శాస్త్ర చికిత్సలో పంది గుండెతో ఆ వ్యక్తి సుమారు 40 రోజుల పాటూ బతికారు. అయితే గత కొన్ని రోజులుగా గుండె స్పందనలో క్రమంగా మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో మృత్యుంజయుడనుకున్న ఆ 58 ఏళ్ల లారెన్స్ ఫౌసెట్ మరణించారు.

అత్యంత ప్రయోగాత్మకంగా శస్త్రచికిత్స చేసిన 40 రోజుల తర్వాత, పంది నుండి తీసిన గుండెను అమర్చిన రెండవ వ్యక్తి మరణించినట్లు సీఎన్ఎన్ నివేదించింది. 58 ఏళ్ల లారెన్స్ ఫౌసెట్, సెప్టెంబరు 20న జన్యుపరంగా మార్పు చెందిన పిగ్ హార్ట్‌ను స్వీకరించి గుండె వైఫల్యంతో చనిపోతున్నాడు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తెలిపిన వివరాల ప్రకారం, మొదటి నెలలో గుండె ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించింది, అయితే ఇటీవలి రోజుల్లో ప్రతికూల సంకేతాలు కనిపించడం మొదలైంది. శస్త్రచికిత్స తర్వాత దాదాపు ఆరు వారాల పాటు జీవించి సోమవారం మరణించాడు.

కుటుంబ సభ్యులతో సరదాగా..

మిస్టర్. ఫౌసెట్ తన శస్త్రచికిత్స తర్వాత గణనీయమైన పురోగతిని సాధించారు. ఈ ఆపరేషన్ తరువాత కుటుంబ సభ్యులతో సరదాగా గడిపాడు. అతని భార్య ఆన్‌తో కలిసి పేకాట కూడా ఆడాడు. ఇటీవలి రోజుల్లో, అతని గుండె సర్జరీలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఇందులో భాగంగా కొన్ని ప్రారంభ సంకేతాలను చూపించింది. సుదీర్ఘ అనుభవం ఉన్న వైద్య బృందం గొప్ప ప్రయత్నం చేసినప్పటికీ మిస్టర్ ఫౌసెట్ చివరికి అక్టోబర్ 30న మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇలా మరణించిన వ్యక్తి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో అపారమైన అనుభవంగణించి రిటైర్డ్ అయిన ల్యాబ్ టెక్నీషియన్ గా గుర్తించారు. అతను మేరీల్యాండ్ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా సాంప్రదాయ గుండె మార్పిడి కోసం ప్రయత్నించి నిరాశ చెందాడు. దీనిపై ఆయన సతీమణి స్పందిస్తూ.. తన భర్త చాల తక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడిపి ఉంటాడని.. ఇదే ఇతని జీవితంలో చివరి గడియలని ఆమె ఊహించలేదని తెలిపారు. మన అనుభవం నుంచి నేర్చుకున్న వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎప్పుడూ తన భర్త చెబుతూ ఉండేవారని ఆయన చివరి కోరికను కూడా పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

అవయవాల కొరతను అధిగమించవచ్చు..

జంతువుల అవయవాలను మానవులకు మార్పిడి చేయడాన్ని జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ అని పిలుస్తారు. ఇది మానవ అవయవ దానాల కొరతను అధిగమించేందుకు దోహదపడుతుంది. అయితే, ఈ ప్రక్రియలో కొన్ని సవాళ్ళను అధిగమించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. రోగి యొక్క రోగనిరోధక శక్తిని ఇతరుల నుంచి మార్పిడి చేసిన అవయవాల ప్రభావం ద్వారా తనలోని కొన్ని శరీర భాగాలను దాడి చేస్తుంది. పంది భాగాలను జన్యుపరంగా మార్పు చేయడం వల్ల మానవ అవయవాలలాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు భావించారు. గతంలో మేరీల్యాండ్ అనే వైద్య బృందం గత ఏడాది ప్రపంచంలోనే జన్యుపరంగా మార్పు చెందిన పంది గుండెను మరొక వ్యక్తికి మార్పిడి చేసింది. అతను ఆపరేషన్ చేసిన రెండు నెలల తర్వాత మరణించాడు. డేవిడ్ బెన్నెట్, జనవరి 7, 2022న తన గుండె ఆపరేషన్ చేసికుని మార్చి 8న మరణించాడని యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సిస్టమ్ ఒక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..