Cruise Ship: అగ్రరాజ్యంలో గుర్తు తెలియని వ్యాధి బారిన పడిన 300 మంది.. క్రూయిజ్‌లో ప్రయాణించినట్లు గుర్తింపు..

ఓడలో  2,881 మంది ప్రయాణికులు ప్రయాణించగా.. వారిలో 284 మంది వ్యాధి బారిన పడ్డారని.. ఇది ప్రయాణీకుల్లో 10 శాతంకాగా.. అదే సమయంలో 1,159 మంది సిబ్బందిలో  34 మంది సభ్యులు అనారోగ్యానికి గురైనట్లు.. అంటే దాదాపు 3 శాతం మంది గుర్తు తెలియని వ్యాధి బారిన పడినట్లు వెల్లడించింది. 

Cruise Ship: అగ్రరాజ్యంలో గుర్తు తెలియని వ్యాధి బారిన పడిన 300 మంది..  క్రూయిజ్‌లో ప్రయాణించినట్లు గుర్తింపు..
Princess Cruise Ship
Follow us

|

Updated on: Mar 11, 2023 | 1:09 PM

ప్రపంచం ఇంకా కరోనా సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా పూర్తిగా బయట పడక ముందే.. మళ్ళీ రకరకాల వైరస్ లు వెలుగులోకి వస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. మళ్ళీ కొందరు గుర్తు తెలియని వ్యాధి బారిన పడ్డారంటూ  సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది.  ప్రిన్సెస్ క్రూయిసెస్ రూబీ ప్రిన్సెస్ షిప్‌లో ఇటీవల ప్రయాణించిన 300 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది గుర్తు తెలియని అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. వీరంతా రూబీ ప్రిన్సెస్ షిప్‌లో ఫిబ్రవరి 26 … మార్చి 5 మధ్య టెక్సాస్ నుండి మెక్సికోకు వెళ్లి తిరిగి వచ్చారని తెలిపింది.

ది మెట్రో న్యూస్ నివేదిక ప్రకారం.. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) పరిశోధకులు ఓడలో  2,881 మంది ప్రయాణికులు ప్రయాణించగా.. వారిలో 284 మంది వ్యాధి బారిన పడ్డారని.. ఇది ప్రయాణీకుల్లో 10 శాతంకాగా.. అదే సమయంలో 1,159 మంది సిబ్బందిలో  34 మంది సభ్యులు అనారోగ్యానికి గురైనట్లు.. అంటే దాదాపు 3 శాతం మంది గుర్తు తెలియని వ్యాధి బారిన పడినట్లు వెల్లడించింది.

CDC పరిశోధన ప్రకారం.. బాధితులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. అయితే.. ఈ వ్యాధికి కారణం మాత్రం  తెలియాల్సి ఉందని పేర్కొంది.  CDC ప్రకారం ఓడలోని వారు అనారోగ్యానికి గురైన వెంటనే.. , ఓడను శుభ్రం చేయడంపై సిబ్బంది దృష్టి పెట్టారు. క్రిమిసంహారక పద్ధతులను ఉపయోగించారు. అదనంగా CDC పరీక్ష కోసం బాధితుల నుంచి మలం నమూనాలను సేకరించారు. అదే సమయంలో ప్రిన్సెస్ క్రూయిసెస్ సిబ్బంది.. ఒక ప్రకటన చేస్తూ.. ఓడలోని ప్రయాణీకులు, సిబ్బంది బాధితుల సంఖ్య పెరుగూ ఉండడంతో.. తాము వెంటనే ఓడ పరిశుభ్రతపై మరింత దృష్టి పెట్టామని తెలిపింది. ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా నివారించే విధంగా చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. ది వాషింగ్టన్ పోస్ట్  నివేదిక ప్రకారం, ఓడలో ఉన్న వ్యక్తులు జీర్ణశయాంతర వ్యాధితో బాధపడుతున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..