Viral: యజమానిని మంచం దిగనివ్వకుండా మొరుగుతూనే ఉన్న పెంపుడు కుక్క.. అనుమానమొచ్చి చూడగా..
శునకం అత్యంత విశ్వాసపాత్రమైన జంతువు. ఒక్కసారి దాన్ని దగ్గరకు తీసుకుంటే.. చచ్చేదాకా యజమానికి విశ్వాసంగా ఉంటుంది.

శునకం అత్యంత విశ్వాసపాత్రమైన జంతువు. ఒక్కసారి దాన్ని దగ్గరకు తీసుకుంటే.. చచ్చేదాకా యజమానికి విశ్వాసంగా ఉంటుంది. సరిగ్గా ఇదే నిదర్శనంగా దక్షిణాఫ్రికాలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఓ విషపూరిత సర్పం నుంచి తన యజమానిని కాపాడింది అతడి పెంపుడు కుక్క. మంచం కింద నక్కి ఉన్న పాము(బ్లాక్ మాంబా)ను చూసి కుక్క పదే పదే మొరగడంతో యజమాని క్షణాల్లో అప్రమత్తమై తన ప్రాణాలను కాపాడుకోగలిగాడు.
దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వ్యక్తి ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ఆ శునకానికి యజమాని అంటే ఎంతో ప్రేమ. యజమానికి ఏమైనా జరిగితే తట్టుకోలేదు. అయితే మూడు రోజుల క్రితం విషపూరితమైన బ్లాక్ మాంబా సర్పం యజమాని ఇంట్లోకి ప్రవేశించి, మంచం కింద నక్కింది. ఈ పామును కుక్క గమనించి, పదే పదే మొరిగింది. ఆ కుక్క అతడ్ని మంచం మీద నుంచి కాలు పెడుతుంటే కూడా కుక్క కింద పెట్టనివ్వలేదు. రెండు రోజుల పాటు అదే తంతు కొనసాగింది. మూడో రోజు కూడా కుక్క మొరగడం, కాళ్లను కింద పెట్టనివ్వకపోవడంతో యజమానికి అనుమానం వచ్చింది. దీంతో మంచం కింది భాగాన్ని పరిశీలించగా పాము కనిపించింది. అప్రమత్తమైన యజమాని పాములను పట్టే వ్యక్తికి సమాచారం అందించాడు. స్నేక్ క్యాచర్ ఆ ఇంటికి చేరుకుని పామును పట్టేశాడు. అనంతరం దాన్ని సమీప అడవుల్లో వదిలేశాడు. అయితే దక్షిణాఫ్రికాలో కనిపించే అత్యంత విషపూరిత పాముల్లో ఇది ఒకటి.
