Russian Ships Black Sea: నల్ల సముద్రంపై కన్నేసిన అమెరికా.. రష్యాపై బాంబుల వర్షం కురిపించేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ
Russia Ukraine War: మరో సారి సారి తెరమీదకు వచ్చింది బ్లాక్ సీ(Black Sea). సముద్ర రవాణాకు పేరొందిన నల్లసముద్రంపై అమెరికా(America) కన్ను పడింది. ఉక్రెయిన్(Ukraine) సరిహద్దులోనే ఉన్న నల్ల సముద్రం నుంచి రష్యాను..

మరో సారి సారి తెరమీదకు వచ్చింది బ్లాక్ సీ(Black Sea). సముద్ర రవాణాకు పేరొందిన నల్లసముద్రంపై అమెరికా(America) కన్ను పడింది. ఉక్రెయిన్(Ukraine) సరిహద్దులోనే ఉన్న నల్ల సముద్రం నుంచి రష్యాను(Russia) టార్గెట్ చేయాలన్న లక్ష్యానికి అమెరికా వచ్చింది. ఇప్పటికే తన దగ్గర ఉన్న జలంతర్గాంములను, పలు షిప్‌లను నల్లసముద్రం పరిసరాల్లో మోహరించింది. వందలాది నేవీ షిప్‌లు, వార్ హెడ్స్‌ను తరలిస్తోంది. రష్యా ఉక్రెయిన్‌కు విసురుతున్న సవాళ్లను గట్టిగా తిప్పి కొట్టేందుకు నల్ల సముద్రాన్ని ఎంపిక చేసుకున్నట్టు రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. సల్ల సముద్రానికి సమీపంలోనే రష్యాతో పాటు.. నాటో దేశాలైన , టర్కీ, జార్జియా, బల్గేరియా, రొమేనియా, మాల్డోవాలు ఉంటాయి. రష్యాను ఢీ కొట్టాలంటూ.. ఈ దేశాల సపోర్టు కూడా కావాలన్న ఉద్దేశంతో ఈ మార్గం మీదుగా వార్ దాడులు చేయాలని నాటో దేశాలు భావిస్తున్నాయి.
అయితే.. ఇప్పటికే బ్లాక్ సీలో వార్ అలజడి మొదలయింది. రుమేనియా ఫైటర్ జెట్ కుప్పకూలినట్టు తెలుస్తోంది. అయితే.. రష్యానే వార్ జెట్‌ను కూల్చినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. మరో వైపు.. ఫైటర్ జెట్ కోసం IAR-330 చాపర్‌ని అన్వేషణకు పంపింది.
ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం..
ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. ఒక వైపు మాటల మంత్రాంగం నడుస్తూనే.. మరోవైపు బాంబులతో మారణహోమం జరుగుతూనే ఉంది. ఎవరికి ఎవరు తగ్గేదేలే అన్న రీతిలో దాడులు చేసుకుంటున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా రాత్రి కూడా నిప్పుల వాన కొనసాగుతూనే ఉంది.
కీవ్, ఖర్కివ్ నగరాలపై రాకెట్లు, క్షిపణులు దూసుకెళ్లి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఏకదాటిగా జరుగుతున్న పేలుళ్ల శబ్దాలతో ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. ఉక్రెయిన్‌లోని ఖర్కివ్ సిటీపై ఈ రాత్రి మళ్లీ దాడి జరిగింది. రెండు చోట్ల రష్యా బాంబుల వర్షం కురిపించింది. లాంచర్లతో దాడులు చేస్తోంది.
ఇవి కూడా చదవండి: Blood Sugar: వేసవిలో డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలంటే ఈ 5 పండ్లను తినండి..
Summer Tips: వేసవిలో పెరుగు కంటే మజ్జిగ ఎందుకు మంచిది.. తెలిస్తే షాక్ అవుతారు..
