ఆ దేశం ఒక యుద్ధ ప్రయోగశాల !

ఆ దేశం ఒక యుద్ధ ప్రయోగశాల !

ప్రచ్ఛన్న యుద్ధ కలం నుంచి ఆ దేశం మధ్య ఆసియా ప్రాంతంలో అత్యంత కీలకం. దక్షిణాసియా దేశాలకు యూరోపా దేశాలకు మధ్య వారధి ఆ దేశం. కానీ ఇపుడు ఆ దేశం ఒక యుద్ధ ప్రయోగశాలగా మారిపోయింది. మారిపోయింది అనడం కంటే ఆలా మార్చారు అనడం బెటర్. ఎందుకంటే ప్రచ్ఛన్న యుద్ధ కలంలో యుద్ధోన్మాదంతో రంకెలేసిన అగ్ర రాజ్యం ఇపుడు పైకి శాంతి ప్రవచనాలను వల్లిస్తూనే మరో వైపు తన మాట వినని దేశాలను, సంస్థలను దారిలోకి […]

Rajesh Sharma

|

Sep 19, 2019 | 1:55 PM

ప్రచ్ఛన్న యుద్ధ కలం నుంచి ఆ దేశం మధ్య ఆసియా ప్రాంతంలో అత్యంత కీలకం. దక్షిణాసియా దేశాలకు యూరోపా దేశాలకు మధ్య వారధి ఆ దేశం. కానీ ఇపుడు ఆ దేశం ఒక యుద్ధ ప్రయోగశాలగా మారిపోయింది. మారిపోయింది అనడం కంటే ఆలా మార్చారు అనడం బెటర్. ఎందుకంటే ప్రచ్ఛన్న యుద్ధ కలంలో యుద్ధోన్మాదంతో రంకెలేసిన అగ్ర రాజ్యం ఇపుడు పైకి శాంతి ప్రవచనాలను వల్లిస్తూనే మరో వైపు తన మాట వినని దేశాలను, సంస్థలను దారిలోకి తెచ్చుకునేందుకు పరోక్ష యుద్ధాలను ప్రోత్సహిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇపుడు మధ్య ఆసియాలో అత్యంత కీలకమైన ఆఫ్ఘానిస్తాన్ ఒక యుద్ధ ప్రయోగశాలగా మారిపోయింది. తాలిబాన్లతో శాంతి చర్చలకు ససేమిరా అంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. దాంతో అసహనంతో ఊగిపోతున్న తాలిబన్లు రోజుకో చోట మారణకాండని కొనసాగిస్తున్నారు. కారు బాంబులతో రక్తపాతం సృష్టిస్తున్నారు. ఆత్మాహుతి దాడులతో జనం ప్రాణాల్ని హరిస్తూ, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం సృష్టిస్తున్నారు. ఫలితంగా రోజుకు సగటున 74 మంది ఆఫ్ఘన్ పౌరులు మృతువాత పడుతున్నారు. మొత్తంగా చూస్తే ఆఫ్ఘానిస్తాన్ దేశం అమెరికా కు ఒక యుద్ధ ప్రయోగశాల గా మారిపోయింది. ఇంత జరుగుతున్నా ఆ దేశంలో శాంతి స్థాపనకు అమెరికా అధ్యక్షుడు చొరవ చూపింది లేదు సరికదా చర్చలు జరిపేది లేదంటూ మాటల మంటలతో తాలిబన్లను రెచ్చగొడుతున్నారు. అమెరికా వైఖరి ఆఫ్ఘన్ సర్కారుకు అసహనం తెప్పిస్తుండగా తాలిబన్లను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈ వైఖరి మారక పోతే ఆఫ్ఘానిస్తాన్ లో జనం భవిష్యత్తుపై ఆశ లేక ఉగ్రవాదం వైపు మొగ్గుచూపి రక్తపాతం మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దక్షిణ, మధ్య ఆసియా దేశాల పట్ల అమెరికా వైఖరి మారకపోతే ఆసియా దేశాలలో అశాంతి చెలరేగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu