వాయిద్యాలతో ‘జనగణమన’ పలికించిన అమెరికన్ ఆర్మీ

భారత్- అమెరికాల మధ్య రక్షణపరమైన సంబంధాలను బలోపేతం చేసే దిశగా.. ఇరు దేశాల జవాన్ల మధ్య ‘యుధ్ అభ్యాస్ 2019’ను నిర్వహించిన విషయం తెలిసిందే. వాషింగ్టన్‌లోని జాయింట్ బేస్ లెవిస్- ఎంసీచొర్డ్‌లో సెప్టెంబర్ 5తో ప్రారంభమైన ఈ కార్యక్రమం 18తో ముగిసింది. రెండు వారాల పాటు కొనసాగిన యుధ్ అభ్యాస్‌లో భారత్- అమెరికాకు చెందిన సైనికులు ఉమ్మడి విన్యాసాలు చేశారు. ఇక ఎక్సర్‌సైజ్‌లో భాగంగా అమెరికా ఆర్మీకి చెందిన కొందరు మన జాతీయ గీతం ‘జనగణమన’ను ప్లే […]

వాయిద్యాలతో 'జనగణమన' పలికించిన అమెరికన్ ఆర్మీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 19, 2019 | 11:13 AM

భారత్- అమెరికాల మధ్య రక్షణపరమైన సంబంధాలను బలోపేతం చేసే దిశగా.. ఇరు దేశాల జవాన్ల మధ్య ‘యుధ్ అభ్యాస్ 2019’ను నిర్వహించిన విషయం తెలిసిందే. వాషింగ్టన్‌లోని జాయింట్ బేస్ లెవిస్- ఎంసీచొర్డ్‌లో సెప్టెంబర్ 5తో ప్రారంభమైన ఈ కార్యక్రమం 18తో ముగిసింది. రెండు వారాల పాటు కొనసాగిన యుధ్ అభ్యాస్‌లో భారత్- అమెరికాకు చెందిన సైనికులు ఉమ్మడి విన్యాసాలు చేశారు. ఇక ఎక్సర్‌సైజ్‌లో భాగంగా అమెరికా ఆర్మీకి చెందిన కొందరు మన జాతీయ గీతం ‘జనగణమన’ను ప్లే చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. భారతీయ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.