ఎంత పెద్ద గోడ ! ఓకె ! ట్రంప్ సంతృప్తి …

ఎంత పెద్ద గోడ ! ఓకె ! ట్రంప్ సంతృప్తి ...

అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో జరుగుతున్న గోడ నిర్మాణాన్ని ప్రెసిడెంట్ ట్రంప్ పరిశీలించారు. మెక్సికో నుంచి అక్రమంగా తమ దేశంలో ప్రవేశించేవారిని అడ్డుకునేందుకు కడుతున్న గోడను చూసిన ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న ఫెన్సింగ్ స్థానే స్టీల్, కాంక్రీట్ బ్యారియర్ తో పటిష్టంగా 30 అడుగుల ఎత్తున ఈ గోడను నిర్మిస్తున్నారు. దీని పొడవునా గల చిన్న సైజు సొరంగాలను కూడా తాను పరిశీలిస్తానని, అక్రమవలసదారులు వీటి గుండా ప్రవేశించకుండా చర్యలు తీసుకోవలసి ఉందని ఆయన చెప్పారు. ‘ […]

Pardhasaradhi Peri

|

Sep 19, 2019 | 4:02 PM

అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో జరుగుతున్న గోడ నిర్మాణాన్ని ప్రెసిడెంట్ ట్రంప్ పరిశీలించారు. మెక్సికో నుంచి అక్రమంగా తమ దేశంలో ప్రవేశించేవారిని అడ్డుకునేందుకు కడుతున్న గోడను చూసిన ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న ఫెన్సింగ్ స్థానే స్టీల్, కాంక్రీట్ బ్యారియర్ తో పటిష్టంగా 30 అడుగుల ఎత్తున ఈ గోడను నిర్మిస్తున్నారు. దీని పొడవునా గల చిన్న సైజు సొరంగాలను కూడా తాను పరిశీలిస్తానని, అక్రమవలసదారులు వీటి గుండా ప్రవేశించకుండా చర్యలు తీసుకోవలసి ఉందని ఆయన చెప్పారు. ‘ ఈ గోడపై మీరు కోడిగుడ్డును ఫ్రై చేయవచ్చు. ఎవరూ దీన్ని ఎక్కలేరు కూడా ‘ అని ఆయన తనవెంట వఛ్చిన జర్నలిస్టులతో సరదాగా అన్నారు. కొత్త గోడ నిర్మాణం 500 మైళ్ళ పొడవునా వచ్ఛే సంవత్సరాంతానికి పూర్తవుతుందని ట్రంప్ చెప్పారు. ప్రస్తుతం న్యూ మెక్సికోతో సహా కాలిఫోర్నియా వంటి చోట్ల మూడు రోజుల పర్యటనలో ఉన్నారు ట్రంప్. లాస్ ఏంజిలిస్, శాన్ ఫ్రాన్సిస్కో రాష్ట్రాల్లో అనేకమంది ఇళ్ళులేక ఇంకా నిరాశ్రయులుగా ఉన్నారు. డెమొక్రాట్ల రాష్ట్రాలైన వీటిలో… కొన్నేళ్లుగా ఉన్న ఈ సమస్యను ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవడానికి యత్నిస్తున్నారు. వచ్ఛే ఏడాది నవంబరు లో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తున్న ఆయన ఇప్పటినుంచే తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. గత ఎన్నికల్లో తాను హామీ ఇఛ్చినట్టు గోడ నిర్మాణాన్నిపూర్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu