AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taliban: మహిళలపై ఆగని తాలిబన్ల అణచివేత.. వారికి బదులు పురుషులను ఉద్యోగాలకు పంపాలని హుకుం

ఉద్యోగం కోసం ఆఫీస్ రావడం మానుకుని వారి ఇళ్లలోనే ఉండాలంటూ కొందరు మహిళలను ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన తాలిబన్ అధికారులు ఆదేశించారు.

Taliban: మహిళలపై ఆగని తాలిబన్ల అణచివేత.. వారికి బదులు పురుషులను ఉద్యోగాలకు పంపాలని హుకుం
Taliban Rules
Janardhan Veluru
|

Updated on: Jul 19, 2022 | 11:28 AM

Share

Afghan Talibans: ఆఫ్గానిస్థాన్‌లో మహిళలపై అణచివేతలను అధికార తాలిబన్లు కొనసాగిస్తున్నారు. మహిళల విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని చేతల్లో చూపుతున్నారు. ఇప్పటికే పలువురు మహిళా ఉద్యోగులపై వేటు వేయగా.. కొందరు ఉద్యోగుల వేతనాలను సగానికి కోతపెట్టారు. తాజాగా మహిళా ప్రభుత్వ ఉద్యోగులు తమ స్థానంలో పురుషులను ఉద్యోగాలకు పంపాలంటూ తాలిబన్లు ఓ హుకుం జారీ చేశారు. ఉద్యోగం కోసం ఆఫీస్ రావడం మానుకుని వారి ఇళ్లలోనే ఉండాలంటూ కొందరు మహిళలను ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన తాలిబన్ అధికారులు ఆదేశించారు. తనకు బదులు ఉద్యోగానికి పురుషుడిని పంపాలని తాలిబన్ అధికారులకు నుంచి ఓ ఉద్యోగిణికి ఫోన్ వచ్చినట్లు ది గార్డియన్ పత్రిక వెల్లడించింది. త్వరలోనే తనను ప్రభుత్వ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయనున్నట్లు సమాచారమిచ్చారని ఆ మహిళ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం కోల్పోతే తన తనయుడు స్కూల్ ఫీజులు ఎలా చెల్లించాలంటూ ఆ మహిళ ఆవేదన వ్యక్తంచేశారు.

గత 15 ఏళ్లుగా తాను ఆర్థిక శాఖలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపిన ఆ మహిళ.. తన స్థానంలో పురుషులను ఉద్యోగానికి పంపాలని ఆర్థిక శాఖ హెచ్ఆర్ విభాగానికి చెందిన ఓ అధికారి ఫోన్ చేసి చెప్పారని వెల్లడించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ చదవిని తాను ఆర్థిక మంత్రిత్వ శాఖలో డిపార్ట్‌మెంట్ హెడ్‌గా తాను పనిచేస్తున్నట్లు ఆ మహిళ తెలిపారు. తమ ఇంట్లో ఉన్నత చదువులు చదువుకున్న పురుషులు ఎవరూ లేరని.. ఒక్కసారిగా తన స్థానంలో మరో వ్యక్తిని తాను ఎలా ఉద్యోగానికి పంపగలనని ప్రశ్నించారు. ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసే అంశాన్ని పున:పరిశీలించాలని ఆఫీస్‌కు వెళ్లగా.. అధికారి దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. ఆఫీస్ నుంచి వెంటనే వెళ్లిపోవాలని.. తమ నిర్ణయంలో మార్పు ఉండబోదని స్పష్టంచేసినట్లు వాపోయారు. తాము ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగిస్తే మహిళా ఉద్యోగులందరూ కలిసి ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టాలని నిర్ణయించినట్లు ఓ మహిళా ఉద్యోగి తెలిపారు.

ఆచార, సాంప్రదాయాల పేరుతో తాలిబన్లు మహిళల పట్ల చులకనగా ప్రవర్తిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా ఇప్పటికే పలు సందర్భాల్లో అభ్యంతరం తెలిపింది. మహిళా సాధికారతను అడ్డుకునేలా తాలిబన్లు ప్రవర్తిస్తున్నారు. యువతులు స్కూళ్లు, కాలేజీలు, ఆఫీస్‌లకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ కథనాలు చదవండి..