Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Crisis: ఆఫ్ఘన్ నుంచి బయలుదేరిన చివరి అమెరికన్ సైనికుడి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ..! ఎవరో తెలుసా?

ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా పోరు ముగిసింది. అక్కడ నుంచి మూటా ముల్లె సర్దేసింది. గడువుకు ఒక్కరోజు ముందుగానే చివరి విడత సైనికులను తీసుకుని అమెరికా యుద్ధవిమానాలు ఆఫ్ఘన్ ను వదిలి వెళ్ళిపోయాయి.

Afghanistan Crisis: ఆఫ్ఘన్ నుంచి బయలుదేరిన చివరి అమెరికన్ సైనికుడి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ..! ఎవరో తెలుసా?
Afghan Crisis American Troops
Follow us
KVD Varma

|

Updated on: Aug 31, 2021 | 4:39 PM

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా పోరు ముగిసింది. అక్కడ నుంచి మూటా ముల్లె సర్దేసింది. గడువుకు ఒక్కరోజు ముందుగానే చివరి విడత సైనికులను తీసుకుని అమెరికా యుద్ధవిమానాలు ఆఫ్ఘన్ ను వదిలి వెళ్ళిపోయాయి. తాలిబాన్ల రాక్షస పాలన పూర్తిస్థాయిలో అక్కడ ప్రారంభం అయిపోయింది. అమెరికా సైనిక బలగాలు వెనుతిరిగి వెళ్ళిపోయిన సందర్భంలో ఒక ఫోటో మీడియాలో అందరినీ ఆకర్షించింది. అది ఒక అమెరికా సైనికుడు చీకట్లో నడుస్తూ వస్తున్న దృశ్యం. దాదాపుగా అన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ ఫోటోను అమెరికా బలగాల పూర్తి తరలింపు వార్తా ప్రసారానికి ఉపయోగించాయి. దీంతో ఆ సైనిక దుస్తుల్లో ఉన్న వారెవరు అనే సందేహం చాలా మందికి వచ్చింది. దానికి సమాధానం అమెరికా రక్షణ శాఖ ఒక ట్వీట్ ద్వారా ఇచ్చింది.

అమెరికా రక్షణ శాఖ ట్వీట్ ప్రకారం.. ఆ సైనిక దుస్తుల్లో ఉన్న వ్యక్తి మేజర్ జనరల్ క్రిస్ డోనాహు. ఆయన యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ఘనిస్తాన్ నుండి బయలుదేరిన చివరి యుఎస్ మిలిటరీ సభ్యుడిగా చెబుతున్నారు. “ఆఫ్ఘనిస్తాన్ నుండి బయలుదేరిన చివరి అమెరికన్ సైనికుడు: మేజర్ జనరల్ క్రిస్ డోనాహు 2021 ఆగస్టు 30 న యుఎస్ వైమానిక దళానికి చెందిన సి -17, కాబూల్‌లో యుఎస్ మిషన్‌ను ముగించారు” అని అమెరికా రక్షణ శాఖ తన ట్వీట్‌లో పేర్కొంది.

మేజర్ జనరల్ డోనాహు 82 వ ఎయిర్‌బోర్న్ డివిజన్ కమాండింగ్ ఆఫీసర్. ఈ డివిజన్ ఫోర్ట్ బ్రాగ్, నార్త్ కరోలినాకు చెందిన 18 వ ఎయిర్‌బోర్న్ కార్ప్స్, యుఎస్ ఆర్మీకి చెందినది. USA టుడేలోని ఒక నివేదిక ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ నుండి తన సైన్యాలన్నింటినీ ఉపసంహరించుకునేందుకు అమెరికా విధించుకున్న స్వీయ గడువు ఆగస్టు 31. ఈ గడువు ముగిసే వరకూ ఈ నెలలో కాబూల్ విమానాశ్రయ భద్రతా బాధ్యతలను చూడటానికి ఈ అధికారిని నియమించారు. ఆయన 1992 లో యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత రెండవ లెఫ్టినెంట్‌గా నియమితులయ్యారు.

ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా, ఉత్తర ఆఫ్రికా, తూర్పు ఐరోపాలో కార్యకలాపాలను పర్యవేక్షించడానికి డోనాహును 17 సార్లు కీలక.. క్లిష్టమైన విధులలో నియమించారు. అతని కెరీర్‌లో పెంటగాన్‌లో ఉద్యోగం కూడా ఉంది. అక్కడ ఆయన జాయింట్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్‌కు ప్రత్యేక సహాయకుడిగా పనిచేశారు.

ఇప్పుడు పెంటగాన్ షేర్ చేసిన వైరల్ ఇమేజ్, ఆ అధికారి బయలుదేరే సి -17 విమానం ఎక్కడానికి సిద్ధమవుతున్న సమయంలో తీసింది. 9/11 దాడుల నేపథ్యంలో 2001 లో అమెరికా సైనికులు ఆఫ్ఘన్ గడ్డపై అడుగుపెట్టారు. దేశంలో మొదటిసారిగా పాలనను స్వాధీనం చేసుకున్న ఐదు సంవత్సరాల తరువాత వారు తాలిబాన్లను ఓడించారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ప్రెసిడెంట్ జో బిడెన్ సైనికులను అక్కడ నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు.

అమెరికా రక్షణ శాఖ ట్వీట్ ఇదే!

 

Also Read: Afghanistan Crisis: మొదలైన తాలిబన్ అరాచక పాలన.. లైవ్ వీడియో

Afghanistan Crisis: భారమైన హృదయంతో మాతృ భూమిని వదిలి పోతున్నాను.. ఆఫ్గాన్‌ ఫిలిమ్‌ మేకర్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.