AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taliban – India talks: భారత్‌ వ్యతిరేక ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్‌ అడ్డాగా మార్చొద్దు.. తాలిబన్లకు భారత్‌ స్ట్రాంగ్ వార్నింగ్..

తాలిబన్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది భారత్‌. ఆఫ్ఘనిస్తాన్‌ను భారత్‌ వ్యతిరేక ఉగ్రవాదులకు అడ్డాగా మార్చవద్దని హెచ్చరించింది. ఖతార్‌ రాజధాని దోహలో...

Taliban - India talks: భారత్‌ వ్యతిరేక ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్‌ అడ్డాగా మార్చొద్దు.. తాలిబన్లకు భారత్‌ స్ట్రాంగ్ వార్నింగ్..
Sanjay Kasula
|

Updated on: Aug 31, 2021 | 6:51 PM

Share

తాలిబన్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది భారత్‌. ఆఫ్ఘనిస్తాన్‌ను భారత్‌ వ్యతిరేక ఉగ్రవాదులకు అడ్డాగా మార్చవద్దని హెచ్చరించింది. ఖతార్‌ రాజధాని దోహలో తాలిబన్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు భారత రాయబారి దీపక్‌ మిట్టల్‌. ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులకు ఎలాంటి హానీ తలపెట్టవద్దని కోరారు. అంతేకాదు ఆఫ్గన్‌ నుంచి భారతీయుల తరలింపును కూడా అడ్డుకోవద్దని సూచించారు. తాలిబన్లతో అధికార హోదాలో భారత్‌ చర్చలు జరపడం ఇదే తొలిసారి.

తాలిబన్ నాయకులతో భారత్ రాయబారి దీపక్ మిట్టల్ మంగళవారం సమావేశం అయ్యారు. ఖతార్‌లోని తాలిబాన్ రాజకీయ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ మావేశంలో ఆ దేశ నాయకుడు షేర్ మహ్మద్ అబ్బాస్‌ను భారత రాయబారి దీపక్ మిట్టల్ కలిశారు.

అయితే గత కొద్ది రోజులుగా తాలిబన్ నాయకులు భారత్‌ను కోరుతున్నారు. ఈ మేరకు దోహాలోని భారత రాయబార కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరుల భద్రతతోపాటు అక్కడే చిక్కుకున్నవారు తిరిగి రావడంపై చర్చలు జరిగాయి.

ఇదిలావుంటే.. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఎవరైనా సంతోషంగా ఉన్నారు అని చెప్పుకోవాల్సి వస్తే అది పాకిస్థాన్ మాత్రమే. తాలిబన్ ప్రభుత్వానికి ప్రపంచ దేశాల మద్దతు మూటగట్టడానికి.. ప్రత్యేకించి ఇస్లామిక్ దేశాలన్నిటినీ తాలిబన్లకు దగ్గర చేయడానికి చర్యలు ప్రారంభించింది పాకిస్తాన్. ఇందులో భాగంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి అనేక దేశాలకు ప్రత్యేకించి ఆఫ్ఘనిస్తాన్ పొరుగు దేశాలకు వెళ్లారు.

ఒక నివేదిక ప్రకారం, తాలిబాన్ ప్రభుత్వాన్ని ప్రపంచంలోని చాలా దేశాలు గుర్తించాలని, దీని ద్వారా ఇక్కడ తన ప్రభావాన్ని పెంచుకోవాలని పాకిస్తాన్ బలంగా కోరుకుంటోంది. మరోవైపు, భారతదేశంతో సహా చాలా దేశాలు ‘చూడండి..వేచి ఉండండి’ విధానాన్ని అనుసరిస్తున్నారనేది కూడా నిజం. ఆగస్టు 31 తర్వాత, చిత్రాన్ని దౌత్య స్థాయిలో క్లియర్ చేయడం ప్రారంభించవచ్చు. అప్పటికి విదేశీ సైనికులు.. పౌరులందరూ ఆఫ్ఘనిస్తాన్ నుండి బయటకు వెళ్ళిపోవడం పూర్తవుతుందని భావన.

ఇవి కూడా చదవండి: Terrorists Planning: భారీ దాడులకు టెర్రరిస్టుల ప్లాన్.. ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్

TRS: హ‌స్తినలో గులాబీ దండు.. గల్లీ టూ ఢిల్లీకి టీఆర్ఎస్.. జలదృశ్యంలో పుట్టి దేశ రాజ‌ధానికి చేరిన కేసీఆర్‌ సామ్రాజ్యం..

Follow Us
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?