9/11 – Taliban: వెనక్కి తగ్గిన కాలకేయులు.. ఆఫ్గన్‌లో తాలిబన్ల ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమం రద్దు..

9/11 - Taliban: ఆఫ్గనిస్థాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమం రద్దయ్యింది. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రదాడి జరిగి 20 ఏళ్లు పూర్తయిన వేళ.. ఆఫ్గనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శనివారం(సెప్టెంబర్ 11న) నిర్వహించాలని తాలిబన్లు భావించారు.

9/11 - Taliban: వెనక్కి తగ్గిన కాలకేయులు.. ఆఫ్గన్‌లో తాలిబన్ల ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమం రద్దు..
Afghanistan Crisis
Follow us

|

Updated on: Sep 11, 2021 | 10:47 AM

9/11 – Taliban: ఆఫ్గనిస్థాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమం రద్దయ్యింది. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రదాడి జరిగి 20 ఏళ్లు పూర్తయిన వేళ.. ఆఫ్గనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శనివారం(సెప్టెంబర్ 11న) నిర్వహించాలని తాలిబన్లు భావించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా పాకిస్థాన్, చైనా, టర్కీ, కతర్, రష్యా, ఇరాన్ దేశాలకు ఆహ్వానం కూడా పంపించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనబోమని రష్యా స్పష్టంచేసింది. అయితే సెప్టెంబర్ 11 దాడులకు 20 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని తాలిబన్లపై దాని కూటమి పక్షాల నేతలు ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తాలిబన్లు ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు రష్యాకు చెందిన టీఏఎస్ఎస్ న్యూస్ ఏజెన్సీ వెళ్లడించింది.

సెప్టెంబర్ 11నాడు నిర్వహించ తలపెట్టిన ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తాలిబన్లు రద్దు చేసుకునేలా కతర్‌పై అమెరికాతో పాటు నాటో కూటమి దేశాలు ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 11నాడే ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం అమానుషమని ఆ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినట్లు సమాచారం. ఆ మేరకు కతర్ పాలకులు తాలిబన్లకు కీలక సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 11నాడు ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తే అంతర్జాతీయ సమాజం నుంచి తాలిబన్ ప్రభుత్వం పట్ల మరింత వ్యతిరేకత పెరగొచ్చని కతర్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. తద్వారా తాలిబన్ ప్రభుత్వానికి ప్రపంచ దేశాల గుర్తింపు లభించడం మరింత కష్టతరంగా మారొచ్చని తెలిపింది. ఈ ఒత్తిళ్లకు తలొగ్గి తాలిబన్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

తాలిబన్ల ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు వెల్లడించిన ఆఫ్గన్ ప్రభుత్వ కల్చురల్ కమిషన్ సభ్యుడు సమాంఘని..ప్రజలను మరింత గందరగోళానికి గురిచేయడం ఇష్టంలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్తగా ఏర్పడిన మంత్రివర్గం ఇప్పటికే పని మొదలుపెట్టినట్లు చెప్పారు.

సెప్టెంబర్ 11నాడు ఏంజరిగింది?

అమెరికాలో 20 ఏళ్ల క్రితం ఇదే రోజున జరిగిన 9/11 ఉగ్రదాడులు యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. సెప్టెంబర్‌ 11, 2001.. ఈరోజు అమెరికా చరిత్రలోనే కాదు యావత్‌ ప్రపంచాన్ని కొద్దిగంటలు చీకట్లోకి నెట్టేసిన రోజు. ట్విన్‌ టవర్స్‌, పెంటగాన్‌లపై వైమానిక దాడుల తర్వాత.. కరెంట్‌, ఇంటర్నెట్‌, శాటిలైట్‌, రేడియో ఫ్రీక్వెన్సీ కట్టింగ్‌లతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రపంచం మొత్తం భయాందోళలకు లోనైంది.

సెప్టెంబర్‌ 11 ఉగ్రదాడులు.. చరిత్రలోనే ఇప్పటిదాకా రికార్డు అయిన అతిపెద్ద ఉగ్రమారణహోమం. 11 ఎకరాల విస్తీర్ణంలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ జంట భవనాల్లోకి హైజాక్‌ విమానాల ద్వారా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ప్రత్యక్షంగా సుమారు నాలుగు వేల మంది ప్రాణాల్ని బలిగొన్నారు. ఈ దాడి తర్వాత రకరకాల గాయాలతో, జబ్బులతో చనిపోయిన వాళ్ల సంఖ్య చాలా చాలా ఎక్కువ. నష్టపరిహారం కోసం ఇప్పటిదాకా 67,000 దరఖాస్తులు వచ్చాయి. వీసీఎఫ్‌(విక్టిమ్‌ కాంపంజేషన్‌ ఫండ్‌) ద్వారా 40 వేలమందికి పైగా.. దాదాపు 9 బిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని అందజేసినట్లు నిర్వాహకురాలు రూపా భట్టాచార్య చెప్తున్నారు. ఈ లెక్కన బాధితుల సంఖ్య ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

Also Read..

ప్రపంచం ఉలిక్కిపడేలా చేసిన ఉగ్రదాడికి 20 ఏళ్లు.. తెర వెనుక ఇంత జ‌రిగిందా..!

Pregnency: గర్భధారణ ఇప్పుడు వద్దు.. నవ దంపతులకు ఆ దేశం ప్రత్యేక వినతి

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?