Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan: ఆకలి తీర్చుకునేందుకు అవయవాలను అమ్ముకుంటున్నారు.. ఆఫ్గన్ ప్రజలను ఆదుకోండి: WFP

Afghanistan people sell children and body parts: తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన ఆఫ్గానిస్తాన్‌ (Afghanistan) లో పరిస్థితులు రోజురోజుకు దిగజారి పోతున్నాయి. తాలిబన్ల పాలన

Afghanistan: ఆకలి తీర్చుకునేందుకు అవయవాలను అమ్ముకుంటున్నారు.. ఆఫ్గన్ ప్రజలను ఆదుకోండి: WFP
Afghanistan People
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 29, 2022 | 4:45 PM

Afghanistan people sell children and body parts: తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన ఆఫ్గానిస్తాన్‌ (Afghanistan) లో పరిస్థితులు రోజురోజుకు దిగజారి పోతున్నాయి. తాలిబన్ల పాలన నాటినుంచి దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు తాలిబన్ల (Taliban) ఆరాచకం.. మరోవైపు కరోనా మహమ్మారి, ఆర్థిక సంక్షోభం, కరువు ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఆకలితో అలమటిస్తూ నిత్యం చాలామంది మరణిస్తున్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఆఫ్గానిస్తాన్‌లో ఆహార సంక్షోభంతో ఆకలిచావులు నానాటికి పెరిగిపోతున్నాయని.. యూఎన్ హెడ్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP) చీఫ్ మళ్లీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్ ప్రజలు మనుగడ కోసం తమ పిల్లలను, వారి శరీర భాగాలను విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో సగానికి పైగా జనాభా ఆకలితో అలమటిస్తున్నందున ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయాన్ని వేగవంతం చేయాలని WFP చీఫ్ డేవిడ్ బేస్లీ మరోసారి అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. మనవాతా హృదయంతో అంతా స్పందించాలని కోరారు. ఆఫ్ఘనిస్తాన్‌లో కరువు, మహమ్మారి, ఆర్థిక పతనం, సంవత్సరాల సంఘర్షణ ప్రభావాలతో పోరాడుతోందని పేర్కొన్నారు. దాదాపు 24 మిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. ఈ శీతాకాలంలో సగానికి పైగా జనాభా కరువును ఎదుర్కొంటుందని.. ఈ సంవత్సరం జనాభాలో 97 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన పడిపోవచ్చని బేస్లీ ఆవేదన వ్యక్తంచేశారు.

“అఫ్ఘనిస్తాన్ ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటిగా ఉంది.. కనీసం 20 సంవత్సరాలు తాలిబాన్‌తో విభేదాల కారణంగా పరిస్థితిలు తారుమారయ్యాయని.. బీస్లీ జర్మన్ ప్రభుత్వ యాజమాన్యంలోని అంతర్జాతీయ ప్రసార సంస్థ డ్యుయిష్ వెల్లే (DW)తో అన్నారు. వారంతా విపత్తును ఎదుర్కొంటున్నారని.. 40 మిలియన్ల మందిలో ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య 23 మిలియన్ల మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాను కలిసిన ఒక మహిళ గురించి బేస్లీ మాట్లాడుతూ.. వేరేవారు తన కుమార్తెను మంచిగా పోషించుకుంటారనే ఆశతో మరొక కుటుంబానికి బలవంతంగా విక్రయించినట్లు తెలిపారు.

గత ఏడాది ఆగస్టులో అమెరికా, మిత్రదేశాలు దేశం విడిచిపెట్టినప్పటికీ అనేక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు,. బృందాలు స్థానికులకు మద్దతు ఇవ్వడం, దేశంలో తీవ్రతరం అవుతున్న ఆహార సంక్షోభం, మానవత సంక్షోభ పరిస్థితులను తగ్గించడం కొనసాగించాయని తెలిపారు. ప్రస్తుత ఆకలి సంక్షోభాన్ని పరిష్కరించడానికి సహాయం చేయాలని బీస్లీ ప్రపంచంలోని అత్యంత ధనవంతులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు దేశాలు సాయం అందిస్తున్నాయని.. మానవాతా వాదులంతా ఇంకా సాయం చేయాలని బేస్లీ కోరారు.

Also Read:

AP Crime News: అమాయక మహిళలే టార్గేట్.. మాట్రిమోని సైట్‌లో చూసి వల వేస్తాడు.. చివరకు

PPF: ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే పీపీఎఫ్‌లో ఎక్కువ వడ్డీ వస్తుందా.. అది ద్రవ్యోల్బణం కంటే అధికంగా ఉంటుందా..