Taliban and China: ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోమంటున్న చైనా.. కోవిడ్ టీకాలను పంపించనున్న డ్రాగన్ కంట్రీ!

KVD Varma

KVD Varma |

Updated on: Sep 15, 2021 | 9:49 PM

చైనా ఆఫ్ఘనిస్తాన్ తో తన సంబంధాలను వేగంగా మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఆఫ్ఘన్ అంతర్గత అంశాలలో జోక్యం చేసుకోమని చెబుతున్న చైనా.. ఆ దేశానికి సహాయం అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది.

Taliban and China: ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోమంటున్న చైనా.. కోవిడ్ టీకాలను పంపించనున్న డ్రాగన్ కంట్రీ!
Taliban Rule

Follow us on

Taliban and China:  కొత్త తాలిబాన్ పాలనతో సాన్నిహిత్యాన్ని పెంచడానికి చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాబూల్‌లో, చైనా రాయబారి వాంగ్ యు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముట్టకీని కలిశారు. ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకోదని వాంగ్ అమీర్‌కు హామీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వాన్ని బీజింగ్ గౌరవిస్తుందని వాంగ్ ఖాన్‌తో చెప్పాడు. గత నెలలో, తాలిబాన్ నంబర్ టూ నాయకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిని బీజింగ్‌లో కలిశారు. ఆఫ్ఘనిస్తాన్‌కు చైనా కూడా సహాయం అందించింది. 

చైనా  టీకాను అందిస్తుంది

వాంగ్ ..అమీర్ సమావేశంలో పరస్పర సంబంధాలపై చర్చలు జరిగాయి.  చైనా ఆఫ్ఘనిస్తాన్‌కు 3 మిలియన్ కోవిడ్ వ్యాక్సిన్‌లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా చైనా 31 మిలియన్ డాలర్ల విలువైన మెటీరియల్స్ పంపిస్తామని ప్రకటించింది. ఇందులో శీతాకాల సామాగ్రి, మందులు ఉన్నాయి. టీకా కూడా ఈ రిలీఫ్ ప్యాకేజీలో భాగం.

చైనా రాయబారి ఏమి చెప్పాడు..

చైనా రాయబారి అమీర్‌తో ఇలా చెప్పాడు – ”మేము ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వాన్ని, స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తాము. దాని అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోము. అభివృద్ధి కోసం ఆఫ్ఘన్ ప్రజలు ఎంచుకున్న మార్గానికి చైనా మద్దతు ఇస్తుంది.” గత నెల ఆగస్టు 15 న ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత చైనా, తాలిబాన్‌ల మధ్య ఇది ​​రెండో అత్యున్నత స్థాయి సమావేశం. ఆగస్టు చివరి వారంలో, తాలిబాన్ డిప్యూటీ రాజకీయ అధిపతి, అబ్దుల్ సలాం హనాఫీ, చైనా రాయబారిని కలిశారు.

తాలిబాన్లకు ధన్యవాదాలు..

కాబూల్, దేశంలోని మిగిలిన ప్రాంతాలలోని చైనా పౌరులు, సంస్థలను కాపాడినందుకు వాంగ్ తాలిబాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. చైనా సహాయానికి అమీర్ కృతజ్ఞతలు తెలిపాడు. రెండు దేశాల మధ్య మంచి పొరుగు సంబంధాలు కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా, ప్రపంచంలోని ఇతర దేశాల సహాయంతో తాలిబాన్లు పరిపాలనా సంస్కరణలు తీసుకొస్తారని, వాటి ద్వారా వారు ఉగ్రవాదాన్ని ఎదుర్కోగలరని అమీర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ భూమిని ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి అనుమతించబడదని కూడా అమీర్ చెప్పాడు.

ఐక్యరాజ్యసమితికి మద్దతు ఇస్తుంది..

జెనీవాలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి చెన్ జు  ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిని మెరుగుపరచడానికి ఐక్యరాజ్యసమితి ఎలాంటి చర్యలు తీసుకున్నా.. చైనా పూర్తి సహాయాన్ని అందిస్తుందని, వారికి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. ఇక్కడే ఆఫ్ఘనిస్తాన్‌కు మూడు మిలియన్ల వ్యాక్సిన్‌లను విరాళంగా ఇస్తున్నట్లు జు ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్‌కు ఇది కష్టమైన సమయం అని, ప్రపంచం దీనికి సహాయం చేయాలని చెన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

Doordarshan: మన టీవీకి 62 ఏళ్లు.. దూరదర్శన్‌గా మొదలైన అడుగులు.. ఇప్పుడు నెట్‌వర్క్ నీడలో పరుగులు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu