AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మా స్కూలు విద్యార్థినుల రికార్డులను తగులబెట్టాం’.. ఆఫ్ఘన్ లో ఓ పాఠశాల వ్యవస్థాపకురాలి ఆవేదన

తమ స్కూల్లో చదివిన విద్యార్థినుల రికార్డులనన్నీ తగులబెట్టానని ఆఫ్ఘనిస్థాన్ లో ఓ పాఠశాల వ్యవస్థాపకురాలు తెలిపింది. తాలిబన్ల నుంచి వీరిని, వీరి కుటుంబాలను రక్షించడానికే ఇలా చేయక తప్పలేదని షబానా బాస్జి రాసిఖ్ అనే ఈమె ఆవేదనతో పేర్కొంది.

'మా స్కూలు విద్యార్థినుల రికార్డులను తగులబెట్టాం'.. ఆఫ్ఘన్ లో ఓ పాఠశాల వ్యవస్థాపకురాలి ఆవేదన
Set Fire Her Students Recor
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 22, 2021 | 7:42 PM

Share

తమ స్కూల్లో చదివిన విద్యార్థినుల రికార్డులనన్నీ తగులబెట్టానని ఆఫ్ఘనిస్థాన్ లో ఓ పాఠశాల వ్యవస్థాపకురాలు తెలిపింది. తాలిబన్ల నుంచి వీరిని, వీరి కుటుంబాలను రక్షించడానికే ఇలా చేయక తప్పలేదని షబానా బాస్జి రాసిఖ్ అనే ఈమె ఆవేదనతో పేర్కొంది. దీనివల్ల కనీసం ఈ పిల్లల భవిష్యత్తుకైనా భద్రత ఉంటుందని ఆశిస్తున్నానని ఈమె వెల్లడించింది. ఎంతో బాధతో ఈ చర్య తీసుకుంటున్నానని, ఈ రికార్డులను దగ్ధం చేయని పక్షంలో వీరికి అపాయం కలిగే సూచనలున్నాయని ఆమె వెల్లడించింది. 2002 లో తాలిబన్ల ప్రభుత్వం పడిపోయి ఆఫ్ఘన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం విద్యార్థినులందరినీ స్కూలుకు వెళ్లి ఓ టెస్ట్ రాయమన్నారని,అప్పుడు తానూ ఓ విద్యార్థినినని షబానా ట్వీట్ చేసింది. అంతకుముందు తాలిబన్లు ఇలాగే విద్యార్థినుల స్కూలు రికార్డులను తగులబెట్టారన్న విషయాన్నీ ఆమె గుర్తు చేసింది. అందువల్లే ఆఫ్ఘన్ ప్రభుత్వం విద్యార్థినుల చదువు కోసం మళ్ళీ పరీక్ష రాయించిందని ఆమె పేర్కొంది. ఇన్నేళ్లకు తిరిగి తాలిబన్లు ఇక్కడ అధికారం చేబడుతున్న నేపథ్యంలో ఇక ఈ అమాయక ఆడపిల్లలకు భద్రత ఉండదని ఆమె విచారంగా తెలిపింది.

స్కూల్ ఆఫ్ లీడర్ షిప్ ఆఫ్ ఆఫ్ఘానిస్తాన్ అనే పాఠశాలను ఈమె లోగడ ఏర్పాటు చేసి అనేకమంది ఆడపిల్లలకు విద్య నేర్పిస్తూ వచ్చింది. కానీ షరియా చట్టం కింద తాలిబన్లు ఇకపై ఇలాంటి వాటిని అనుమతించబోరు. మహిళల గౌరవాన్ని తాము భంగపరచబోమని పైకి అంటున్నప్పటికీ వారు ఈ కఠిన చట్టాలను అమలు చేస్తారని షబానా వాపోయింది. దేశంలో ఇంకా ఎన్నో స్కూళ్ళు విద్యార్థినులకు చదువు నేర్పుతున్నాయని మరి వాటి విషయం తనకు తెలియదని ఆమె వ్యాఖ్యానించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓ సలీల్ పరేఖ్ కి కేంద్రం నుంచి సమన్లు.. ఎందుకంటే ..?

తాలిబాన్లకు సీనియర్ ఆఫ్ఘన్ రాజకీయ నేత మద్దతు.. కాబూల్ చేరుకున్న తాలిబన్ కో-ఫౌండర్