AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heartwarming Video: రాక్షస రాజ్యం నుంచి భారత్ చేరుకున్నాం తమ్ముడూ.. ముద్దులతో ముంచేసిన ఆనందంలో చిన్నారి..

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు విధ్వంసం కొనసాగుతోంది. వేలాది మంది ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇళ్ల నుంచి పారిపోతున్నారు. ప్రజలందరూ తమ ప్రాణాలను కాపాడుకునేందుకు సురక్షితమైన ప్రదేశానికి చేరుకుంటున్నారు. తాలిబాన్ నుండి తమను...

Heartwarming Video: రాక్షస రాజ్యం నుంచి భారత్ చేరుకున్నాం తమ్ముడూ.. ముద్దులతో ముంచేసిన ఆనందంలో చిన్నారి..
Afghanistan's Kabul To Ghaz
Sanjay Kasula
|

Updated on: Aug 22, 2021 | 8:11 PM

Share

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు విధ్వంసం కొనసాగుతోంది. వేలాది మంది ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇళ్ల నుంచి పారిపోతున్నారు. ప్రజలందరూ తమ ప్రాణాలను కాపాడుకునేందుకు సురక్షితమైన ప్రదేశానికి చేరుకుంటున్నారు. తాలిబాన్ నుండి తమను తామ రక్షించుకునే క్రమంలో చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ సన్నివేశాలన్నీ చాలా కలవరపెడుతున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు చూస్తే ఎక్కడో ఏదో మిగిలిన ఆశలు చిగురిస్తుంటాయి.  ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి భారతదేశం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం 168 మంది ప్రయాణికులను తీసుకువచ్చింది. 168 మందిలో చిముర్దా అతని కుటుంబం చేరుకున్నారు. వారి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు ముచ్చట పడుతున్నారు.

యుద్ధ పరిస్థితులలో కూడా నిస్వార్థ ప్రేమ

చిన్న బాబును ఎత్తుకుని విమానాశ్రయంలో ఓ తల్లి కూర్చున్నట్లు కనిపిస్తుంది. అదే సమయంలో ఓ చిన్నారి ముద్దులతో ముంచేసింది.  ఆ చిన్నారి కురిపించే ముద్దులను చూసి నెటిజన్లు ఆనంద పడుతున్నారు. ఈ నవ్వులు ఇలానే కొనసాగాలని ఆశీర్వాదం అందిస్తున్నారు. రాక్షస రాజ్యం నుంచి భారత్ చేరుకున్న ఆనందంలో తన తమ్ముడికి ముద్దులు పెట్టడం అక్కడే ఉన్నవారిని.. ఆ తర్వాత నెటిజన్లను ఆకర్శించింది. ఆ తర్వాత ఆ విమానశ్రయంకు విమానం వచ్చింది. కాబూల్ నుంచి 168 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సి -17 విమానం భారతదేశంలోని ఘజియాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న భారతీయులను రక్షించడానికి ప్రయత్నాలు 

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నుండి 168 మంది ప్రయాణికులతో భారత వాయుసేన విమానం భారతదేశంలోని ఘజియాబాద్ చేరుకుంది. విమానంలో మొత్తం 107 మంది భారతీయులు ఉన్నారు. ఎయిర్ ఫోర్స్ C -17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ సహాయంతో సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఎయిర్ ఫోర్స్ C -17 గ్లోబ్‌మాస్టర్ 168 మంది ప్రయాణికులతో ఘజియాబాద్‌లోని హిండన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.

87 మంది భారతీయులతో ఎయిర్ ఇండియా విమానం శనివారం (ఆగస్టు 21) బయలుదేరింది. లాజిస్టిక్స్ సమస్యలు విమానం టేకాఫ్ కాకుండా నిరోధించాయి. ఈ విమానం ప్రస్తుతం అమెరికా భద్రతా దళాల నియంత్రణలో ఉంది. తాలిబాన్ నియంత్రిత ప్రాంతంలో గగనతలం వెలుపల గందరగోళం ఉంది.

గత 24 గంటల్లో, ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న 390 మంది భారతీయులను భారతదేశం స్వదేశానికి పంపింది. అయినప్పటికీ, చాలా మంది భారతీయులు ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకుపోయారు.

ఇవి కూడా చదవండి: Aadhaar Card: ఈ సంగతి మీకు తెలుసా.. మీ ఆధార్ కార్డుతో పర్సనల్ లోన్స్ తీసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి …

CA Exams 2021: ఫైనల్, ఇంటర్ పాత కోర్సు పరీక్షలు రాసేవారికి గుడ్ న్యూస్.. చివరి ప్రయత్నంగా మరో అవకాశం..