AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vruksha Bandhan:చెట్లకు రాఖీ కట్టిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. ఎందుకు అలా చేశాడంటే..?

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాఖీ పండుగను వినూత్నంగా జరుపుకున్నారు. చెట్లకు రాఖీ కట్టి వేడుక చేసుకున్నారు.

Vruksha Bandhan:చెట్లకు రాఖీ కట్టిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. ఎందుకు అలా చేశాడంటే..?
Bihar Cm Nitish Kumar
Balaraju Goud
|

Updated on: Aug 22, 2021 | 8:22 PM

Share

Bihar cm nitish kumar Raksha Bandhan: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాఖీ పండుగను వినూత్నంగా జరుపుకున్నారు. చెట్లకు రాఖీ కట్టి వేడుక చేసుకున్నారు. మానవాళిని కాపాడుకోవడానికి పర్యావరణాన్ని పరరిక్షించవలసిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎం నితీష్ అన్నారు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం 2012 నుంచి రక్షాబంధన్ రోజును వృక్ష రక్షా దివస్‌గా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన చెట్టుకు రాఖీ కట్టి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా బీహార్ రాజధాని పాట్నాలో చెట్లకు రాఖీ బంధన్ చేశారు.

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం 2012 నుంచి రక్షాబంధన్ రోజును వృక్ష రక్షా దివస్‌గా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన చెట్టుకు రాఖీ కట్టి పర్యవరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. ఈ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడు కృషీ చేయాలని, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటాలని చెప్పారు. మొక్కలు నాటడమే కాకుండా, వాటిని కాపాడి, పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం జల జీవన్ హరియాలీ మిషన్ పథకాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా మొక్కలను నాటడంపై ప్రధానంగా దృష్టి పెట్టిందని ఆయన వెల్లడించారు.

పర్యావరణ పరిరక్షణ పట్ల భావి తరాలకు అవగాహన కల్పించడం ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు… కాగా అన్నాచెల్లెళ్ళ ఆత్మీయానురాగాలకు గుర్తుగా జరుపుకునే రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటుండగా దాన్ని పర్యవరవరణ పరిరక్షనకు సీఎం నితీష్ ఉపయోగించుకోవడం మంచి పరిణామమే…

Read Also…  TS Corona: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. పెరుగుతున్న కోలుకున్న వారి సంఖ్య

వర్సిటీల్లో వింత చేష్టలు…శోభనానికి యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లు..! – Watch Video

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!