బోరిస్ జాన్సన్ తో పోటీ.. ‘ కొండ ‘ తోనే ఢీ !

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన కన్సర్వేటివ్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పార్లమెంటును రద్దు చేసిన ఆయన.. డిసెంబరు 12 న జరగనున్న జనరల్ ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆయనకు ఎన్నికల్లో ఎవరూ పోటీ లేరనుకుంటే చటుక్కున ఓ యువ ముస్లిం ఇమ్మిగ్రెంట్ రంగంలో దూకాడు. లేబర్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన 25 ఏళ్ళ అలీ మిలానీ అనే ఈ యువకుడు బోరిస్ కు ఓ మాదిరి పోటీనివ్వవచ్చునని […]

బోరిస్ జాన్సన్ తో పోటీ.. ' కొండ ' తోనే ఢీ !
Follow us
Pardhasaradhi Peri

| Edited By: Srinu

Updated on: Nov 07, 2019 | 8:30 PM

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన కన్సర్వేటివ్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పార్లమెంటును రద్దు చేసిన ఆయన.. డిసెంబరు 12 న జరగనున్న జనరల్ ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆయనకు ఎన్నికల్లో ఎవరూ పోటీ లేరనుకుంటే చటుక్కున ఓ యువ ముస్లిం ఇమ్మిగ్రెంట్ రంగంలో దూకాడు. లేబర్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన 25 ఏళ్ళ అలీ మిలానీ అనే ఈ యువకుడు బోరిస్ కు ఓ మాదిరి పోటీనివ్వవచ్చునని భావిస్తున్నారు. వాయువ్య లండన్ శివారులోని ఉక్స్ బ్రిడ్జ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బోరిస్ కి ఈ సీటు సురక్షితమైనదేమీ కాదట.. 2017 లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడనుంచి ఆయన 5,034 ఓట్ల ఆధిక్యంతో మాత్రమే గెలిచారు. ఈ నియోజకవర్గంనుంచి 5 శాతం ఓట్లు లేబర్ పార్టీకి పడినా బోరిస్ చిక్కుల్లో పడినట్టే.. అయితే ఈ సారి ఆయన ప్రచార ఆర్భాటంతో పోల్చితే మిలానీకి ఉన్న ప్రచార ‘ వనరులు ‘ తక్కువే..బ్రునెల్ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ కూడా అయిన మిలానీ.. జస్ట్ వంద మందితో క్యాంపెయిన్ ప్రారంభించాడు. తన అయిదేళ్ల వయస్సులో తల్లి, సోదరితో ఇరాన్ నుంచి లండన్ చేరుకున్న ఈ యువకుడు ‘ కొండనే ‘ ఢీకొంటున్నట్టే ! బ్రెగ్జిట్ విషయంలో బోరిస్ ప్రభుత్వం ‘ డీలా ‘ పడిన అంశాన్ని ఈ యువకుడు తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించవచ్ఛు.