కర్తార్ పూర్ ‘ కారిడార్ ‘ కథ ఏంటి ? ఆ వీడియో నిజమైనదేనా ?
కర్తార్ పూర్ కారిడార్ పై ఓ సాంగ్ తో కూడిన వీడియోను విడుదల చేసిన పాకిస్తాన్ నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కొత్త వివాదానికి దారి తీస్తోంది. ఈ వీడియోలో సిక్కు యాత్రికులు, పలు గురుద్వారాలు కనిపించడమే గాక.. హతులైన ముగ్గురు ఖలిస్తానీ వేర్పాటువాద నాయకులను కూడా చూపారు. జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే, అమ్రిక్ సింగ్ ఖల్సా, మాజీ మేజర్ జనరల్ షాబేగ్ సింగ్.. ఈ ముగ్గురూ 1984 జూన్ నెలలో జరిగిన ‘ ఆపరేషన్ […]
కర్తార్ పూర్ కారిడార్ పై ఓ సాంగ్ తో కూడిన వీడియోను విడుదల చేసిన పాకిస్తాన్ నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కొత్త వివాదానికి దారి తీస్తోంది. ఈ వీడియోలో సిక్కు యాత్రికులు, పలు గురుద్వారాలు కనిపించడమే గాక.. హతులైన ముగ్గురు ఖలిస్తానీ వేర్పాటువాద నాయకులను కూడా చూపారు. జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే, అమ్రిక్ సింగ్ ఖల్సా, మాజీ మేజర్ జనరల్ షాబేగ్ సింగ్.. ఈ ముగ్గురూ 1984 జూన్ నెలలో జరిగిన ‘ ఆపరేషన్ బ్లూ స్టార్ ‘ సందర్భంగా హతులయ్యారు. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్చల్ చేస్తోంది. అయితే ఈ ముగ్గురి పోస్టర్లూ అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయంతో సహా ఇతర గురుద్వారాలు, పాకిస్తాన్ లోని గురుద్వారాల్లో కూడా కనబడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 1980 ప్రాంతాల్లో ‘ దమ్ దమీ తక్సల్ ‘ పేరిట మతపరమైన సంస్థకు నేతృత్వం వహించిన జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే ఖలిస్థాన్ అనుకూల నాయకుడు. అలాగే అమ్రిక్ సింగ్ ఖల్సా ఖలిస్థాన్ అనుకూల నాయకుడు.. నాడు అఖిల భారత సిక్కు విద్యార్ధి సమాఖ్య అధ్యక్షుడు కూడా., డిస్మిస్ అయిన ఆర్మీ ఆఫీసర్ షాబేగ్ సింగ్.. ఆపరేషన్ బ్లూ స్టార్ సందర్భంలో భింద్రన్ వాలే తో చేతులు కలిపాడు. https://www.facebook.com/ImranKhanOfficial/videos/2491345254526448/
నాడు హతులైన ఈ ముగ్గురినీ పాక్ ఈ వీడియోలో చూపడమేమిటని ఇండియా ప్రశ్నిస్తోంది. అసలు పాకిస్తాన్ ను నమ్మజాలమని, సిక్కుల పట్ల హఠాత్తుగా ఆ దేశానికి ఇంత ప్రేమ ఎలా ముంచుకు వచ్చిందని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ అంటున్నారు. గత 70 ఏళ్లుగా సిక్కులు ఈ కారిడార్ ఎప్పుడు తెరుస్తారా అని వేచి చూస్తున్నారని ఆయన అన్నారు. దీన్ని ఐఎస్ఐ దుర్వినియోగం చేయవచ్చునని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వివాదాస్పదమైన 2020 క్యాంపెయిన్ ని పాక్ అప్పుడే ప్రారంభించిందని,చెప్పిన ఆయన.. ఈ కారిడార్ పట్ల పాక్ కు ‘ హిడెన్ అజెండా ‘ ఏదో ఉందని సందేహం వ్యక్తం చేశారు. మన దేశం అప్రమత్తంగా ఉండాలని అమరేందర్ సింగ్ కోరారు. కాగా-భారత వైపు ఉన్న ఈ కారిడార్ ను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు. (కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాను విజిట్ చేసేందుకు సిక్కు యాత్రికులకు పాస్ పోర్టులు అవసరం లేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు అప్పుడే ఇండియాలో దుమారం రేపుతున్నాయి. ఇది హిందువులు, సిక్కుల మధ్య విభేదాలను లేవనెత్తే విధంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి).