AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bird Flu Virus: బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం.. 47 పులులు, సింహాలు మృతి.. ఎక్కడంటే?

H5N1 వైరస్ బర్డ్‌ప్లూ కారణంగా దక్షిణ వియత్నాంలో 47 పులులు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర మీడియా పేర్కొంది. బర్డ్‌ఫ్లూ వైరస్ కారణంగా మూడు సింహాలు, ఓ పాంథర్ చనిపోయినట్లు వెల్లడించింది. ఈ మరణాలు ఆగస్ట్ సెప్టెంబర్ నెల్లలో జరిగినట్లు వివరించింది.

Bird Flu Virus: బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం.. 47 పులులు, సింహాలు మృతి.. ఎక్కడంటే?
Bird Flu
Velpula Bharath Rao
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 02, 2024 | 5:58 PM

Share

H5N1 వైరస్ బర్డ్‌ప్లూ కారణంగా దక్షిణ వియత్నాంలో 47 పులులు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర మీడియా పేర్కొంది. బర్డ్‌ఫ్లూ వైరస్ కారణంగా మూడు సింహాలు, ఓ పాంథర్ చనిపోయినట్లు వెల్లడించింది. ఈ మరణాలు ఆగస్ట్ సెప్టెంబర్ నెల్లలో జరిగినట్లు వివరించింది.

వీఎన్ఏ( వియత్నాం న్యూస్ ఏజెన్సీ) ఈ వివరాలను మీడియాకు వెల్లడించింది. దక్షిణ వియత్నాంలోని పలు జూలో ఇవి మృతి చెందినట్లు చెప్పారు. మొదట ఇవీ చినపోయిన తర్వాత ల్యాబ్‌కు పంపించిగా..వారు H5N1 వైరస్‌గా వైద్యులు నిర్థారించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా H5N1 వైరస్‌లో టైప్ ఏగా గుర్తించినట్లు పేర్కొంటున్నారు.

కానీ ఈ విషయంపై అక్కడి మీడియా ప్రతినిధులు సంబంధిత అధికారులను స్పష్టత ఇవ్వాలని కోరగా వారు ఈ విషయంపై స్పందించలేదని తెలుస్తుంది. కాగా ఈ మరణించిన జంతువులను చూసుకుంటున్న వారు సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నట్లు జూ సిబ్బంది తెలిపారు. ఇప్పుడు జరిగినట్టే 2004లో థాయిలాండ్‌లో కూడా పులులు మరణించాయి.

అప్పుడు కూడా బర్డ్‌ఫ్లూ కలకలం రేపింది. 388 పులులు వియత్నాంలో ఉన్నట్లు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా 310 పైగా పులులు జూలలో ఉన్నట్లు అర్థమవుతుంది. 2022 నుంచి వైరస్‌లు ఎక్కువ వస్తున్నట్లు డబ్లూహెచ్‌వో తెలిపింది. వన్యప్రాణులు సంరక్షణపై అన్ని దేశ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.