Israel-Iran War: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్ అలర్ట్.. భారతీయులకు కీలక ఆదేశాలు
ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. నివేదికల ప్రకారం, ఇరాన్ ఇజ్రాయెల్‌పై 200 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడిపై అమెరికా అంతకుముందే అలర్ట్ చేసింది. ఈ హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని, ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న తన పౌరులకు భారతదేశం ఒక సలహా జారీ చేసింది...
ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. నివేదికల ప్రకారం, ఇరాన్ ఇజ్రాయెల్‌పై 200 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడిపై అమెరికా అంతకుముందే అలర్ట్ చేసింది. ఈ హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని, ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న తన పౌరులకు భారతదేశం ఒక సలహా జారీ చేసింది. ఈ ముందుజాగ్రత్త సలహాలో అక్కడ నివసిస్తున్న భారతీయులను సురక్షిత ప్రదేశాలలో ఉండాలని భారతదేశం కోరింది.
అయితే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో అప్రమత్తమైన భారత్.. ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ఎవరూ బయటకు రావొద్దని రాయబారి కార్యాలయం సూచించింది టెల్‌అవీవ్‌లో జాగ్రత్తగా ఉండాలని భారతీయులకు అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో నిరంతరం టచ్‌లో ఉందని, అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని భారత్ తెలిపింది. భారతదేశం కూడా హెల్ప్‌లైన్ నంబర్‌ను జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో 32 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇరాన్ క్షిపణి దాడికి ముందు పౌరులందరూ బాంబు షెల్టర్లకు వెళ్లినట్లు సమాచారం.ఈ యుద్ధం కారణంగా విమాన రాకపోకలపై కూడా అలర్ట్ అయ్యింది. పశ్చిమాసియా మీదుగా విమానాల రాకపోకలను దేశాలు రద్దు చేసుకుంటున్నాయి. జర్మనీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం తిరుగుపయనం అయ్యింది. అలాగే జర్మనీ విమానం హైదరాబాద్ వస్తుండగా మధ్యలోనే వెనక్కి వెళ్లిపోయింది.
ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా..
ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ను రక్షించడంలో, ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకున్న క్షిపణులను కూల్చివేయడంలో సహాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ US మిలిటరీని ఆదేశించారు. ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశించినట్లు ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు గతంలో పేర్కొన్నారు. ఎలాంటి ప్రతీకార చర్యకైనా టెహ్రాన్ పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి