స్వచ్ఛ భారత్ అభియాన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ప్రధాని ప్రశంసించారు. ఈ ఉద్యమం విజయవంతం కావడానికి కృషి చేసిన వారందరికీ నా వందనాలు’’ అని సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. అయితే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత విషయంలో ఎన్నో విజయాలు సాధించామని, దేశంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛభారత్‌ను స్వాగతించి వారి వారి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేందుకు ఎంతో కృషి చేశారన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి ఎంతో మద్దతు ఇచ్చారని ప్రశంసించారు.