AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangladesh: బంగ్లాదేశ్‎లో కొనసాగుతున్న హింస.. ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు!..

గత వారం దుర్గా పూజ సందర్భంగా ఆలయ విధ్వంస ఘటనలతో బంగ్లాదేశ్‎లో హింస చెలరేగింది. ఓ గ్రామంలో అరవై ఆరు ఇళ్లు ధ్వంసమయ్యాయి...

Bangladesh: బంగ్లాదేశ్‎లో కొనసాగుతున్న హింస.. ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు!..
Bangladesh
Srinivas Chekkilla
|

Updated on: Oct 18, 2021 | 7:08 PM

Share

గత వారం దుర్గా పూజ సందర్భంగా ఆలయ విధ్వంస ఘటనలతో బంగ్లాదేశ్‎లో హింస చెలరేగింది. ఓ గ్రామంలో అరవై ఆరు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 20 హిందువుల ఇళ్లను దహనం చేశారు. రాజధాని నగరం ఢాకాకు 255 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. గ్రామానికి చెందిన ఒక హిందూ యువకుడు ఫేస్‌బుక్ పోస్ట్‌లో మతాన్ని అగౌరవపరిచాడని పుకారు రావడంతో పోలీసులు మత్స్యకారుల కాలనీకి వెళ్లారు. పోలీసులు ఆ వ్యక్తి ఇంటి చుట్టూ కాపలాగా ఉండడంతో, దాడి చేసిన వారు సమీపంలోని ఇతర ఇళ్లకు నిప్పుపెట్టారని తెలిసింది.

ఫైర్ సర్వీస్ కంట్రోల్ రూమ్ మాజిపారాలో 29 నివాస గృహాలు, రెండు వంటశాలలు, రెండు బార్న్‌లు, 20 గడ్డివాములను తగలబెట్టినట్లు పేర్కొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తెల్లవారుజాము 4:10 వరకు మంటలను ఆర్పివేశారని స్థానికి మీడియా పేర్కొంది. ప్రాణనష్టం గురుంచి ఎలాంటి సమాచారం లేదు. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ డివిజన్‌లోని కుమిల్లాలోని దుర్గా పూజ వేదిక వద్ద మత దూషణ కారణంగా హిందూ దేవాలయాలపై దాడులు మొదలయ్యాయి.

సోషల్ మీడియాలో మత విద్వేషాల వ్యాప్తికి సంబంధించి పోస్టులు చేసిన డజన్ల కొద్దీ మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధ, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్.. చాంద్పూర్, నోఖాలీలో జరిగిన దాడులలో కనీసం నలుగురు హిందూ భక్తులు మరణించారని ఆరోపించారు. ఇంతలో ఢాకా నుండి 155 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫెనిలో హిందువులకు చెందిన దేవాలయాలు, దుకాణాలపై దాడులకు సంబంధించి ఎలైట్ నేర నిరోధక శక్తి రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB) మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. “మతపరమైన హింసకు పాల్పడినందుకు, సోషల్ మీడియాలో ప్రజలను ప్రేరేపించినందుకు వారిని అరెస్టు చేశారు. వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు” అని పారామిలిటరీ ఫోర్స్ లీగల్ అండ్ మీడియా వింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

ప్రధాన మంత్రి షేక్ హసీనా హింస వెనుక ఉన్న దోషులను శిక్షిస్తామని హామీ ఇచ్చింది. హిందూ దేవాలయాలు, కుమిల్లాలోని దుర్గా పూజ వేదికలపై దాడుల్లో పాల్గొన్న తప్పించుకోలేరని తెలిపారు. ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. వారు ఏ మతానికి చెందినవారైనా శిక్షించబడతారని ధాకేశ్వరిలో జరిగిన కార్యక్రమంలో చెప్పారు.

Read Also.. Viral Video: క్యాన్సర్‎ను జయించిన బాలుడు.. ఆస్పత్రి బయటకు వచ్చి తండ్రితో ఏం చేశాడంటే..