Viral Video: క్యాన్సర్‌ను జయించిన బాలుడు.. ఆస్పత్రి బయటకు వచ్చి తండ్రితో ఏం చేశాడంటే..
కొన్ని విషయాలు తెలిసి చాలా మంది భయపడుతుంటారు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా కలవరపెడుతుంటాయి. ప్రాణాంతక వ్యాధి సోకిందని తెలిస్తే వారికి బతుకు మీద ఆశ కోల్పోతారు...
కొన్ని విషయాలు తెలిసి చాలా మంది భయపడుతుంటారు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా కలవరపెడుతుంటాయి. ప్రాణాంతక వ్యాధి సోకిందని తెలిస్తే వారికి బతుకు మీద ఆశ కోల్పోతారు. సాధారణంగా ఆస్పత్రికి వెళ్లినప్పుడు పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారిస్తారు. చికిత్స చేస్తే తగ్గిపోయే అవకాశం ఉందని వైద్యలు చెబుతారు. కానీ కచ్చితంగా తగ్గుతుందని హామీ ఇవ్వలేరు. దీంతో చాలా మంది మానసికంగా కుంగిపోతారు. చికిత్స అనంతరం వ్యాధి నయం అయిందని తెలిస్తే వారి ఆనందానికి అవధులు ఉండువు. వారికి పోయిన ప్రాణం తిరిగొచ్చినంత సంతోషపడతారు. ఇలానే ఓ తండ్రి తన కొడుకుకు క్యాన్సర్ లేదని తెలిసి ఆనందంతో డ్యాన్స్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
క్యాన్సర్ భయంకరమైన వ్యాధుల్లో ఒకటి.. క్యాన్సర్ వచ్చిందంటే దాదాపు చావాల్సిందే. ఇలాన్ ఓ చిన్న బాబుకు అనారోగ్యానికి గురయ్యాడు. బాబు లక్షణాలు చూసి క్యాన్సర్ కావొచ్చని వైద్యులు తెలిపారు. ఇది విన్న తండ్రి గుండె పగిలినంత పని అయింది. పిల్లాడికి అన్ని పరీక్షలు చేయించాలని వైద్యులు సూచించడంతో అన్ని పరీక్షలు చేయించాడు. బాలుడికి చికిత్స అందించడం మొదలు పెట్టారు. ఇలా పిల్లాడు త్వరగా కోలుకున్నాడు. మళ్లీ పరీక్షలు నిర్వహించగా బాబుకు క్యాన్సర్ లేదని తెలిసింది. దీంతో ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన తండ్రికొడుకులు సంతోషంతో డ్యాన్స్ చేశారు. ఈ వీడియో వైరల్ అయింది. తండ్రి మొదట కొడుకును తన చేతుల్లో పట్టుకున్నాడు, తలుపు నుండి బయటకు వచ్చారు. అతను తన కొడుకును కింద దించాడు. ఇద్దరు కలిసి స్టెప్పులేశారు. వారు మైల్స్ యాచ్‌ల వాక్‌త్రూ పాటకు నృత్యం చేశారు.
వీడియోలో అత్యంత అందమైన భాగం ఏమిటంటే, వారిద్దరూ రెడ్ అండ్ బ్లాక్ ప్లాయిడ్ షర్టు, జీన్స్‌లో కవలలుగా ఉన్నారు. “విజయానికి దారితీసే విశ్వాసాన్ని ఎలా నడిపించాలో గొప్ప నాయకులకు తెలుసు” క్యాప్షన్ రాశారు. ఈ వీడియోను బాలుడి తండ్రి అయిన కెన్నిత్ అలెన్ థామస్ అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియోకు దాదాపు 2 వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.
View this post on Instagram
Read Also.. Watch: పెళ్లి కోసం యువ జంట సాహసం.. వరద నీటిలో వంట పాత్రలో ప్రయాణం..