China – US: 6 ఏళ్ల తర్వాత అమెరికాలో జిన్‌పింగ్.! బైడెన్-జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ.. వీడియో.
అమెరికా, చైనాల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఉప్పు, నిప్పులా ఉంటాయి. ఆర్థిక, రాజకీయ, మిలటరీ విబేధాలు ఎప్పటికప్పుడు ఘర్షణల స్థాయికి చేరుకుంటూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికాలో అడుగుపెట్టారు. బైడెన్ ఆహ్వానం మేరకు ఆయన ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార మండలి అపెక్ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు శాన్‌ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. అయితే ఆరేళ్ల తర్వాత జిన్‌పింగ్ మళ్లీ ఇప్పుడు అమెరికాకు వెళ్లడం విశేషం.
అమెరికా, చైనాల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఉప్పు, నిప్పులా ఉంటాయి. ఆర్థిక, రాజకీయ, మిలటరీ విబేధాలు ఎప్పటికప్పుడు ఘర్షణల స్థాయికి చేరుకుంటూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికాలో అడుగుపెట్టారు. బైడెన్ ఆహ్వానం మేరకు ఆయన ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార మండలి అపెక్ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు శాన్‌ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. అయితే ఆరేళ్ల తర్వాత జిన్‌పింగ్ మళ్లీ ఇప్పుడు అమెరికాకు వెళ్లడం విశేషం. చివరిగా 2017లో ఆయన అమెరికాలో పర్యటించారు. రెండు దేశాల అధ్యక్షుల భేటీలో అగ్రనేతల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, తైవాన్ అంశాలు చర్చకు రానున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, ఇజ్రాయెల్-హమాస్ పోరుపై అమెరికా, చైనా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. బైడెన్-జిన్‌పింగ్ భేటీలో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బైడెన్, జిన్‌పింగ్ ముఖాముఖీ భేటీ అవ్వడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. గతేడాది ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 సదస్సులో వీరిద్దరూ తొలిసారి ముఖాముఖీగా సమావేశమయ్యారు. అమెరికా బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లతో జరిగే ప్రైవేటు విందులో జిన్‌పింగ్ పాల్గొనే అవకాశం ఉందని యూఎస్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ విందు కోసం పలు కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య భేటీ విజయవంతం అయితే, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

