New Corona: అమెరికాలో కొత్త కరోనా వేరియంట్.. లక్షణాలు ఇవే.! ప్రమాదకరం కాదంటున్న వైద్యులు.

New Corona: అమెరికాలో కొత్త కరోనా వేరియంట్.. లక్షణాలు ఇవే.! ప్రమాదకరం కాదంటున్న వైద్యులు.

Anil kumar poka

|

Updated on: Nov 15, 2023 | 7:59 PM

రెండున్నరేళ్లు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మరోసారి కొత్తరూపాన్ని ధరించి దాడి చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఈ కొత్త వైరస్‌ శరవేగంగా విస్తరిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ హెచ్‌వీ.1 అమెరికన్లను భయపెడుతోంది. యూఎస్‌ సెంటర్స్‌ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అందించిన డేటా ప్రకారం అక్టోబర్ 28తో ముగిసిన రెండు వారాల వ్యవధిలో కొత్తగా నిర్ధారణ అయిన కేసుల్లో 25.2 శాతం కేసులకు ఈ వేరియంటే కారణమని తేల్చింది.

రెండున్నరేళ్లు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మరోసారి కొత్తరూపాన్ని ధరించి దాడి చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఈ కొత్త వైరస్‌ శరవేగంగా విస్తరిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ హెచ్‌వీ.1 అమెరికన్లను భయపెడుతోంది. యూఎస్‌ సెంటర్స్‌ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అందించిన డేటా ప్రకారం అక్టోబర్ 28తో ముగిసిన రెండు వారాల వ్యవధిలో కొత్తగా నిర్ధారణ అయిన కేసుల్లో 25.2 శాతం కేసులకు ఈ వేరియంటే కారణమని తేల్చింది. గతంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించిన ఈజీ.5 అకా ఎరిస్ వేరియంట్ల కంటే ఈ హెచ్‌వీ.1 వేరియంట్ ఎక్కువ డామినెంట్‌ వేరియంట్‌ అని గుర్తించారు. ఈ వేరియంట్ సోకిన వారిలో కోవిడ్‌ టంగ్‌ లక్షణం కనిపిస్తోందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయపడుతున్నట్టు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదించింది. నాలుక వాపు లేదా మంట ముఖ్య లక్షణంగా ఉంటోంది. కొంతమంది రోగుల నాలుకపై సాధారణం కంటే తెల్లని మందపాటి పొర ఏర్పడుతోంది. దీంతోపాటు నాలుక బాగా ఎర్రగా మారడం, మంట, రుచి కోల్పోవడం, కొద్దిగా తిమ్మిరి కనిపించాయట. కొన్నిసార్లు నాలుకపై గడ్డలు , అల్సర్లు ఏర్పడినట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయితే మన శరీరంలోని ఇమ్యూన్‌ సిస్టం వైరస్‌తో పోరాడుతున్నదానికి సంకేతం కావచ్చని, కొంతమందికి, కొన్ని రోజుల తర్వాత వాపు దానంతట అదే తగ్గిపోతుందని తెలిపారు. మరికొంతమందికి మందులు వాడాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు. అయితే ఈ కొత్త వేరియంట్లు త్వరగా వ్యాప్తి చెందినా ఎక్కువ హాని చేయవని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.