Viral Video: కోతి పిల్లను ఫొటో తీసేందుకు ప్రయత్నించాడు.. తల్లి కోతి ఏం చేసిందో తెలుసా? వైరలవుతోన్న వీడియో
సోషల్ మీడియాలో జంతువుల వీడియోలకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. ఎలాంటి వీడియో అయినా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ కోతి వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

Viral Video: జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే వీటిపై అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. ఎలాంటి వీడియో అయినా సరే పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారి విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. ఇక ఈ వీడియోలో ఓ కోతి చేసిన పని నెటిజన్లను నవ్విస్తోంది. కోతులు చాలా తెలివైనవని మనకు తెలుసు. కోతి తన పిల్లలపై చాలా ప్రేమను చూపిస్తుంటాయి. వాటిని ఏమైనా అన్నామంటే మన పని పడతాయి. ప్రస్తుతం ఈ వీడియోలో కోతి కూడా.. తన పిల్లను కనీసం ఫొటో కూడా తీయనీయకుండా కోపం ప్రదర్శించడం చూస్తే.. మనం కచ్చితంగా ఆశ్చర్యపోతాం.
ఓ కోతి తన పిల్లతో కలిసి కూర్చుని ఉంటుంది. ఇంతలో ఓ వ్యక్తి ఫొటోలు తీసేందుకు ఆ కోతి వద్దకు వస్తాడు. ఇక తన ఫోన్ పట్టుకుని కోతి పిల్లను ఫొటోలు తీస్తుంటాడు. అప్పుడు తల్లి కోతికి బాగా కోపం వచ్చి ఆ ఫోన్‌ను పక్కకు నెట్టేస్తుంటుంది. అలాగే తన పిల్లను గట్టిగా ఒడిలో బంధించి గట్టిగా పట్టుకుని ఉంటుంది. అంతటితో ఆ వ్యక్తి ఆగకుండా మరలా ఫొటోలు తీస్తుంటాడు. ఆ కోతికి బాగా కాలి, మరింత కోపంతో ఆ ఫోన్‌ను పక్కకు నెట్టేస్తుంది.
ఈ ఫన్నీ వీడియో 24_ బర్డ్స్_నిమల్స్ అనే ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో 15 వేలకు పైగా లైక్‌లతో దూసుకపోతోంది. అయితే దీనిపై నెగిటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు. జంతువులను వేధించకూడదంటూ, అలాంటి వారిని జంతువుల వద్దకు అనుమతించకూడదని కామెంట్లు చేశారు. ఇంకా నయం ఫొన్‌ను మాత్రమే పక్కకు నెట్టేసింది. మీదకు ఎగబడనుందుకు సంతోషించంటూ కామెంట్లు వదిలారు.
View this post on Instagram
Also Read:
Viral Video: ఇలాంటి కళను మీరు ఎన్నడూ చూసి ఉండరు.. ఈ వీడియో చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారంతే.. !
TV9 దృశ్యం :నడిరోడ్డు పై భారీ త్రాచుపాముల సయ్యాట..గగుర్పొడిచే వీడియో..:Two Snakes Dance Video.
Viral Video: చూపులేని ఏనుగుకు మరో గజరాజు సాయం.. మనసులను హత్తుకునే వీడియో