Creativity: కరోనా సమయంలో మ్యూజియంలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? ఒక్కసారి ఈ వీడియో చూడండి అర్ధం అవుతుంది..Viral Video
Creativity: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు తోడేస్తోంది. ఒక్కోసారి ఒక్కోలా మారుతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది. ప్రపంచమంతా కరోనా బాధితులు ప్రతిరోజూ నమోదు అవుతూనే ఉన్నారు.
Creativity: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు తోడేస్తోంది. ఒక్కోసారి ఒక్కోలా మారుతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది. ప్రపంచమంతా కరోనా బాధితులు ప్రతిరోజూ నమోదు అవుతూనే ఉన్నారు. ఈ నేపధ్యంలో కరోనా వార్తలు.. విశేషాలు విపరీతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో కరోనా అంటే ఏమిటి దగ్గర నుంచి వస్తే ఏం చేయాలి.. ఒకవేళ ఆ వ్యాధితో చనిపోతే వాళ్ళ బంధువుల పరిస్థితి ఏమిటి దాకా ఎన్నో విషయాలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇక కరోనా మీదా జోకులు వేసేస్తున్నారు చాలా మంది. కొంతమంది కరోనా నియమాలను ప్రజల మనసులకు హత్తుకుపోయేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పాటలు పాడి కొందరు.. డాన్సులతో మరికొందరు కరోనాను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ వస్తున్నారు. ఇదిగో ఇటీవల ఒక టిక్ టాక్ స్టార్ మాస్క్ వాడకంపై అద్భుతమైన వీడియో చేశారు. ఆ వీడియో చూసిన వారంతా అతని క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
ఒక మ్యూజియం.. అందులోకి మ్యూజియం సిబ్బంది ఒకరు వచ్చారు. చేతిలో మాస్క్ పెట్టుకోవాలి అనే బోర్డు ఉంది. దానిని అక్కడ ఒక పక్క అందరికీ కనబడేలా పెట్టాడు. ఇక తరువాత అతను చేసిన క్రియేటివిటీ అంతా ఇంతా కాదు. మాస్క్ పట్టుకుని ఒక ఫోటో ముందుకు వెళ్లి నిలబడతాడు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తీ చెయ్యి బయటకు పెట్టి మాస్క్ తీసుకుంటుంది. తరువాత ఒక ఫోటోలో ఉన్నాయనకి మాస్క్ లోపలికే అందిస్తాడు. ఇలా రెండు మూడు ఫోటోలు దాటి ముందుకు వెళ్ళిన అతనికి తాను మాస్క్ పెట్టుకోలేదని గుర్తువస్తుంది. వెంటనే మాస్క్ తగిలించుకుంటాడు. తరువాత ఒక డైనింగ్ టేబుల్ ఫోటో ఉంటుంది. అక్కడ అందరూ కలిసి కూచుని భోజనం చేస్తుంటారు. దీంతో ఈ వ్యక్తి వారిని అలా ఉండకూడదు అని చెబుతాడు. లోపలి వెళతాడు. అంతే అతనిని చూసి అందరూ పారిపోతారు. ఒక్కరు మిగిలిపోతారు. అతనికి కూడా మాస్క్ ఇస్తాడు. ఇదీ వీడియో. అయినా, ఇలా చెబితే కన్నా.. మీకు చూపిస్తే మీరే చెప్పెస్తారు ఈ వీడియో చేసినాయన గొప్ప క్రియేటర్ అని.. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి..
Museums in #2021 pic.twitter.com/nqNBRGe0RB
— Zach King (@zachking) May 8, 2021
ఈ వీడియో చేసిన వ్యక్తి, ప్రముఖ డిజిటల్ కంటెంట్ సృష్టికర్త ,టిక్‌టాక్ స్టార్ జాక్ కింగ్. టిక్‌టాక్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నట్లు ఇటీవల అవార్డు కూడా కొట్టేసాడు ఈ 31 ఏళ్ల టిక్‌టాక్ స్టార్. ఈయన ఇప్పుడు ట్విట్టర్‌లో ఈ ఉల్లాసమైన క్లిప్‌ను పంచుకున్నారు. ఈ కరోనా మహమ్మారి మధ్య మ్యూజియంలు ఎలా ఉంటాయో చూపించే సృజనాత్మక క్లిప్‌తో నెటిజన్లను ఫిదా చేశాడు. అన్నట్టు మీరూ చూశారుగా వీడియో.. మేం చెప్పింది నిజమే అని ఒప్పుకుంటారు కదూ. ఒప్పుకుని తీరతారు. ఆ నమ్మకం మాకుంది. ఎందుకంటే.. ఈ 24 సెకన్ల క్లిప్ ఇప్పుడు వైరల్ వీడియో. దీనిని 1.5 మిలియన్లకు పైగా ఇప్పటివరకూ చూశారు. చూడటమే కాదు.. అద్భుతమైన కామెంట్లూ పెడుతున్నారు.
ఆ కామెంట్లూ చూడండి..
Very interesting and fantastic . I love it?????
— となりのきたろう (@WettVOEVrRqmsP2) May 9, 2021