AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థి హాల్‌ టిక్కెట్‌ తన్నుకుపోయిన గద్ద..చివర్లో సూపర్‌ ట్విస్ట్‌ !

మనకు సంబంధించిన వస్తువులు గానీ, మనకు రావాల్సిన ఏదైనా అవకాశం గానీ ఇతరులు లాక్కెళ్లిపోతే.. గద్దలా తన్నుకుపోయాడ్రా అంటుంటాం. ఈ నానుడిని నిజం చేస్తూ ఓ గద్ద చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ గద్ద పరీక్ష రాయడానికి వెళ్తున్న విద్యార్థి హాల్‌ టిక్కెట్‌ను తన్నుకుపోయింది. అది కూడా పరీక్షకు కొద్ది నిమిషాల ముందు. అసలే విద్యార్ధులకు పరీక్షలంటే భయం. అందులోనూ టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులైతే.. ఎగ్జామ్స్‌ అంటే చాలా భయపడతారు. పరీక్షకు వెళ్లేముందు హాల్‌ టిక్కెట్‌, పెన్నులు, అన్నీ సరిగా ఉన్నాయోలేదో చూసుకొని ఎంతో జాగ్రత్తగా పరీక్షలకు హాజరువుతుంటారు.

Samatha J
|

Updated on: Apr 18, 2025 | 1:06 PM

Share

ఆలాంటి ఓ విద్యార్థి ఎగ్జామ్‌కు ముందు ఎగ్జామ్‌ సెంటర్‌లో హాల్‌ టిక్కెట్‌ పక్కన పెట్టుకొని కూర్చున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో మాయదారి గద్ద.. వేగంగా వచ్చి హాల్‌ టిక్కెట్‌ను ఎత్తుకెళ్లిపోయింది. ఈ ఘటన కేరళలోని కసర్ గోడ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ పాఠశాలలో కేరళ టెన్త్ బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 7:30 గంటల సమయంలో ఓ విద్యార్థి కిటీకీ పక్కన కూర్చుని చదువుకుంటూ ఉన్నాడు. హాల్ టికెట్ ను కిటికీ పక్కనే పెట్టాడు. ఇంతలో ఓ గద్ద ఒక్కసారిగా వచ్చి ఆ హాల్ టికెట్ ఎత్తుకెళ్లిపోయింది. పాఠశాలపై అంతస్తులోని కిటికీపై నిల్చొని చూస్తూ ఉంది. దీంతో తోటి విద్యార్థులు గద్దకు రాళ్లు విసిరారు. అయినా హాల్ టికెట్ వదల్లేదు. అయితే ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది ఆ గద్ద. హాల్‌ టిక్కెట్‌ పోయిందని ఏడుస్తున్న ఆ విద్యార్థి ఏడుపు చూసి కరిగిపోయిందో ఏమో కానీ.. సరిగ్గా పరీక్షకు ఓ ఐదు నిమిషాలు ఉందన్న టైమ్‌లో హాల్‌ టిక్కెట్‌ను విద్యార్థి ముందు వదిలేసి వెళ్లిపోయింది. దీంతో ఆ విద్యార్థి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వెంటనే హాల్‌ టిక్కెట్‌ అందుకొని.. కళ్లు తుడుచుకుంటూ.. పరీక్షకు వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో

అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో

రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో