తనకు తానే అంత్యక్రియలు జరిపిన మహిళ.. ఎందుకో తెలిస్తే కన్నీరు ఆగదు..వీడియో
చైనాలో ఒక వింత ఘటన జరిగింది. 30 ఏళ్ల మహిళ బతికి ఉండగానే తనకి తాను అంత్యక్రియలు చేసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజలు ఈ వీడ్కోలు కార్యక్రమానికి వచ్చి ఆ స్త్రీని ఆశీర్వదించారు. ఆ మహిళ ఇలాంటి పని ఎందుకు చేసిందో తెలిస్తే కన్నీరు పెడతారు. అయ్యో అని అంటారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న జియాంగ్ యి అనే మహిళకు మూడు నెలల క్రితం గర్భాశయ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఆమె బతకడానికి ఇంకా రెండేళ్లు మాత్రమే మిగిలి ఉందని వైద్యులు చెప్పారు. ఇది విన్న తర్వాత ఆ స్త్రీ చాలా బాధపడింది. అయితే ఆశను వదులుకోలేదు. దీని తరువాత.. తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తోంది. తాను బతికి ఉండగానే ప్రపంచానికి, స్నేహితులకు వీడ్కోలు చెప్పడానికి తన సొంత అంత్యక్రియలను నిర్వహించుకుంది.భర్త, బిడ్డకి తల్లి అయిన జియాంగ్ తన అంత్యక్రియల కోసం తన చిత్రపటాన్ని చిత్రించుకుంది. దానిని తనకు అత్యంత ప్రియమైన జ్ఞాపకంగా రూపొందించుకుంది. ఒక పోస్టర్ కూడా తయారు చేయించుకుని.. దానిపై – నమస్తే! నేను దురదృష్టవంతురాలీని ..కాకపోతే… నేను రాబోయే రెండేళ్లలో దేవదూతను అవుతాను.. మీ ఆశీస్సులు నాకు తప్పకుండా ఇస్తారని ఆశిస్తున్నానని కాప్షన్ కూడా రాసింది.
మరిన్ని వీడియోల కోసం
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్ వాటే లైఫ్ వీడియో
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

