పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..
హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో విషాదం జరిగింది. మస్కిటో కాయిల్ వల్ల ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఆమె మంచంపై ఉన్న సమయంలో ఆ పరుపుపై కాయిల్ నుంచి వెలువడిన నిప్పురవ్వలు పడ్డాయి. దాన్నుంచి విపరీతమైన పొగ కూడా వచ్చింది. ఈ పొగను పీల్చిన వృద్ధురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కాయిల్ ను.. బెడ్‌కు సమీపంలోనే ఉంచటం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని మల్కాజిగిరిలో అనసూయ అనే 82 ఏళ్ల వృద్ధురాలు.. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. తన కుమారుడు మోహన్ శ్రీనివాస్‌తో కలిసి నివాసం ఉంటోంది. అయితే అనసూయ గత వృద్ధాప్యంతో కొన్ని నెలలుగా మంచానికే పరిమితమైంది. ఈ పొరపాటు అస్సలు చేయకండి! సోదరి గృహప్రవేశం ఉండటంతో ఫిబ్రవరి 7న శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి బెంగళూరు వెళ్లాడు. తల్లిని చూసుకునేందుకు ఒక కేర్‌టేకర్‌ను ఏర్పాటు చేశాడు. అయితే ఫిబ్రవరి 11 తెల్లవారుజామున హైదరాబాద్‌కు తిరిగి వచ్చేందుకు శ్రీనివాస్ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో వారింట్లో అద్దెకు ఉంటున్న సంతోష్ అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయని శ్రీనివాస్‌కు చెప్పాడు. దీంతో శ్రీనివాస్ వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి విషయం చెప్పాడు. అనసూయ గదిలో పొగలు రావటంతో పాటుగా ఆమె అపస్మారకస్తితిలోకి వెళ్లటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరుసటి రోజు ఆమె మరణించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అబ్బా.. కరోనా వైరస్ పై ఎట్టకేలకు నోరు విప్పిన చైనా..
అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా
పీఎఫ్ పై వడ్డీ మరింత తగ్గనుందా?? ఫిబ్రవరి 28 సమావేశంలో నిర్ణయం
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

