కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు
పెళ్లిలో అత్తింటివారు కొత్తగా కాపురం పెట్టే కుమార్తెకు, అల్లుడికి ఇంటికి కావాలసిన వస్తువులు కొనిస్తారు. అయితే ఒక పెళ్లిలో తన మామ పెట్టిన వస్తువులు నచ్చలేదని వరుడు.. వధువుతో చెప్పాడు. దీంతో అతడి ప్రవర్తనతో మనస్తాపం చెందిన వధువు కుటుంబం ఏకంగా ఆ పెళ్లినే రద్దు చేసుకుంది. ఆ వరుడు ప్రైవేటు టీచర్ కాగా.. ప్రస్తుతం సివిల్స్‌కు కూడా ప్రిపేర్ అవుతున్నాడు.
వధువు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వరుడి తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈమధ్య కొత్తగా పెళ్లయిన జంటలు విడిపోవడానికి కారణాలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటోంది. చిన్న చిన్న కారణాలతో పీటల మీద ఆగిపోతున్న పెళ్లిళ్లు ఎన్నో ఉంటున్నాయి. మూడు ముళ్లు పడే వరకు ఆ పెళ్లి జరుగుతుందో లేక ఆగుతుందో అనే డౌట్‌లు వస్తున్నాయి. తాజాగా ఆగిపోయిన ఓ పెళ్లికి సంబంధించిన కారణం వింటే మాత్రం ప్రతీ ఒక్కరు ముక్కున వేలేసుకుంటారు. ఆ ఇద్దరికీ పెళ్లి నిశ్చయమైంది. కానీ ఈ పెళ్లి కేవలం.. సారె సామాను వల్ల నిలిచిపోయిందంటే నమ్మగలరా? కానీ నిజంగానే ఇలా జరిగింది. దీంతో ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతీ ఒక్కరు వరుడితో పాటు ఆయన కుటుంబాన్ని విమర్శిస్తున్నారు. యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధం అవుతూ.. ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి.. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఓ యువతిని చూసి పెళ్లి నిశ్చయం చేశారు. పెళ్లికి ముందే అంటే 10 రోజుల ముందే పెళ్లిలో పెట్టే కానుకలను వధువు తండ్రి.. తనకు కాబోయే అల్లుడి ఇంటికి పంపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..
భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్.. చూస్తే మతిపోతుంది
పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?
పెళ్లివేదికపై రెండు జంటలూ ఒకేలా.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
బ్రెయిన్ ఉన్నవాళ్లే ఈ ట్యాప్ తిప్పగలరు! మీకు ఉందో లేదో చెక్ చేసుకోండి