ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..
సాధారణంగా సాంకేతిక లోపాలతోనో.. బాంబు బెదిరింపులతోనో విమానాలు ఆగిపోతుంటాయి. క్యాన్సిల్ అవుతాయి లేదంటే ఆలస్యంగా నడుస్తాయి. ఒక పిల్లి కారణంగా విమానం ఆగిపోయిన ఘటనలు ఎక్కడైనా చూశారా? రోమ్‌లో ఓ పిల్లి ఏకంగా రెండు రోజులు విమానాన్ని ఆపేసింది. విమానంలోని విద్యుత్ వైర్లలో నక్కిన పిల్లి ఎంతకూ బయటకు రాకుండా సిబ్బందిని ముప్పు తిప్పలు పెట్టింది.
దాంతో విమానం ఆగిపోయింది. రోమ్ నుంచి జర్మనీ వెళ్లేందుకు ఓ విమానం ప్రయాణికులతో టేకాఫ్‌కు సిద్ధమైంది. ఇంతలోనే పైలట్లకు పిల్లి అరుపు వినిపించింది. దీంతో విమానం టేకాఫ్‌ను కాసేపు ఆపి ఆ పిల్లి అరుపులు ఎక్కడినుంచి వస్తున్నాయోనని విమానం అంతా వెతికారు. ఎలక్ట్రికల్ బేలో పిల్లి నక్కి ఉండటాన్ని గుర్తించారు. భద్రతా కారణాల దృష్ట్యా విమాన ప్రయాణాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు. ఎంత ప్రయత్నించినా విద్యుత్తు వైర్లలో దాక్కున్న పిల్లి బయటకు వచ్చేందుకు ససేమిరా అనడంతో సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు. ఎట్టకేలకు రెండు రోజుల తర్వాత ఆ పిల్లి దానంతట అదే విమానాన్ని వీడి ఎంచక్కా నడుచుకొంటూ వెళ్లిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్.. చూస్తే మతిపోతుంది
పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?
పెళ్లివేదికపై రెండు జంటలూ ఒకేలా.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
బ్రెయిన్ ఉన్నవాళ్లే ఈ ట్యాప్ తిప్పగలరు! మీకు ఉందో లేదో చెక్ చేసుకోండి
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

